జయలలిత బయోపిక్.. తలైవిగా ఆమె.. ఎవరంటే!  - MicTv.in - Telugu News
mictv telugu

జయలలిత బయోపిక్.. తలైవిగా ఆమె.. ఎవరంటే! 

November 23, 2019

భారతీయ భాషల్లోని వివిధ సినీ పరిశ్రమల్లో ఇప్పుడు బయపిక్‌ల హవా నడుస్తోంది. గతించిన చరిత్రలను చక్కగా స్క్రీన్ మీద అప్లై చేసే పనిలో దర్శక నిర్మాతలు తలమునకలై ఉన్నారు. ఈ క్రమంలో దివంగత తమిళ‌నాడు ముఖ్యమంత్రి, సినీనటి జ‌య‌ల‌లిత జీవిత చ‌రిత్రను ఆధారంగా చేసుకుని ‘తలైవి’ అనే సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో జయలలిత పాత్రలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటిస్తోంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఫ‌స్ట్‌లుక్ పోస్టర్‌, టీజ‌ర్‌ను విడుదల చేశారు చిత్రయూనిట్‌. అసలు జయలలిత పాత్రకు తొలుత నిత్యామీనన్‌ను తీసుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. చివర్లో దర్శకుడు కంగనా వైపు మొగ్గుచూపాడు.

దీంతో చాలామంది జయలలిత పాత్రకు కంగనా నప్పదు అన్నారు. కానీ, ఇవాళ విడుదల అయిన ఫస్ట్‌లుక్, టీజర్ చూశాక కంగనానే జయలలిత పాత్రకు సరిగ్గా సూట్ అయిందని అంటున్నారు. టీజ‌ర్‌లో జ‌య‌లలిత‌కు సంబంధించిన రెండు గెట‌ప్‌ల‌ను విడుద‌ల చేశారు.
ఆమె సినిమాల్లో హీరోయిన్‌గా చేసినప్పటినుంచి రాజకీయాలలో ముఖ్యమంత్రిగా ఎదిగిన తీరును ఈ చిత్రంలో చూపిస్తున్నారు. బ్లేడ్ ర‌న్నర్‌, కెప్టెన్ మార్వెల్ వంటి హాలీవుడ్ చిత్రాల్లో వ‌ర్క్ చేసిన ప్రముఖ హాలీవుడ్ మేక‌ప్ ఆర్టిస్ట్ కంగ‌నా ర‌నౌత్‌ను జ‌య‌ల‌లిత‌గా చూపిస్తున్నారు. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అర‌వింద‌స్వామి దివంగ‌త త‌మిళ‌నాడు ముఖ్యమంత్రి, సీనియర్ నటుడు ఎంజీఆర్‌ పాత్రలో న‌టిస్తున్నాడు. అలాగే మరో నేత, దివంగ‌త మాజీ ముఖ్యమంత్రి క‌రుణానిధి పాత్రలో విల‌క్షణ న‌టుడు ప్రకాష్‌రాజ్ నటిస్తున్నాడు. ఈ సినిమాను విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్‌.సింగ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవలే, చెన్నైలో షూటింగ్ ప్రారంభం అయిన ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్ 26న విడుదలకు సిద్ధం అవుతోంది.