పాక్ ప్రధానిపై ఆనంద్ మహీంద్ర సెటైర్
వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా ట్విట్టర్‌లో ఎప్పుడూ ఆక్టివ్‌గా ఉంటారు. ఎప్పుడూ వివిధ వీడియోలను షేర్ చేసే ఆయన తాజాగా పాక్ ప్రధానికి సంబందించిన ఓ వీడియోను షేర్ చేస్తూ ఆయనపై అదిరిపోయే సెటైర్ వేశారు.
Thank you Oh Lord, for ensuring that this gentleman was not my History or Geography teacher…? pic.twitter.com/cIGxX0UdSh
— anand mahindra (@anandmahindra) August 25, 2019
ఈ ఏడాది మొదట్లో ఇరాన్ పర్యటనకు వెళ్లిన ఇమ్రాన్ ఖాన్ ఓ సమావేశంలో మాట్లాడుతూ…‘సరిహద్దు దేశాల సంబంధాలు మెరుగ్గా ఉంటే వాణిజ్యం మెరుగ్గా ఉంటుంది. అయితే జర్మనీ, జపాన్ దేశాలు లక్షలాది ప్రజలను హతమార్చాయి. సరిహద్దును పంచుకుంటున్న ఈ దేశాలు రెండో ప్రపంచ యుద్ధం సమయంలో హింసను ప్రేరేపించాయని, అనంతరం వ్యాపార ఒప్పందాలతో రాణించాయని’ అన్నారు. నిజానికి జపాన్, జర్మనీ దేశాలు సరిహద్దును పంచుకోవు. ఈ వీడియోను మహీంద్రా పోస్ట్ చేస్తూ..‘ఇమ్రాన్ ఖాన్ అనే వ్యక్తిని తనకు జాగ్రఫీ టీచర్‌గా చెయ్యకుండా చూసినందుకు దేవుడికి ధన్యవాదాలు’ అన్నారు.