నిన్ను కలిశాకే నాజీవితం మారిపోయింది.. నయన్‌పై విఘ్నేష్ పోస్టు - MicTv.in - Telugu News
mictv telugu

నిన్ను కలిశాకే నాజీవితం మారిపోయింది.. నయన్‌పై విఘ్నేష్ పోస్టు

October 22, 2019

nayanatara..

నటి నయనతార, తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా విఘ్నేష్ నయన్ గురించి ఓ పోస్ట్ పెట్టారు. ఈపోస్ట్ చాలా మందిని అలరిస్తోంది. నయనతారను కలిసిన తర్వాతే తన జీవితం ఎంతో మధురంగా మారిందని పోస్ట్ పెట్టాడు. దీనిపై చాలామంది నెటిజన్లు స్పందిస్తున్నారు. మీ జంట చాలా బాగుంటుంది.. త్వరగా పప్పన్నం తినిపించండి అంటూ సరదాగా ఆటపట్టిస్తున్నారు. విఘ్నేష్ దర్శకత్వం వహించిన ‘నానుమ్‌ రౌడీదాన్‌’ సినిమాలో నయనతార ముఖ్య పాత్ర పోషించింది. 2015 అక్టోబర్‌ 21న ఈ సినిమా విడుదలై మంచి విజయాన్ని సాధించింది. 

అయితే సోమవారంతో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి నాలుగు సంవత్సరాలు అయిన సందర్భంగా విఘ్నేష్‌ సోషల్‌మీడియా వేదికగా నయనతారను ఉద్దేశిస్తూ  భావోద్వేగ పోస్ట్‌ చేశాడు. నయన్‌తో దిగిన ఓ ఫోటోను జతచేస్తూ.. ‘నయన్‌.. నిన్ను కలిశాకే నా జీవితం ఎంతో మధురంగా మారింది. ‘నానుమ్‌ రౌడీదాన్‌’ సినిమాతో నాకు విజయాన్ని అందించినందుకు ధన్యవాదాలు. ఈ సినిమాలో నటించి.. నేనో మంచి జీవితాన్ని పొందే అవకాశాన్ని నాకు అందించావు. నువ్వు ఎప్పుడూ ఇలాగే అందంగా, సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. లార్డ్‌ ఆఫ్‌ లవ్‌’ అని విఘ్నేష్‌ పోస్ట్ చేశాడు. కాగా, ఈ సినిమా తెలుగులో 2016లో ‘నేను రౌడీనే’ పేరుతో విడుదల అయింది. ఈ సినిమా షూటింగ్‌ సమయంలోనే విఘ్నేష్‌-నయనతార ప్రేమలో పడ్డారని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం నయన్‌ నటిస్తున్న ‘నెట్రికన్‌’ సినిమాను విఘ్నేష్‌ శివన్‌ నిర్మిస్తున్నాడు.