అమ్మానాన్నలకు ప్రేమతో బెంజ్.. సందీప్ కానుక - MicTv.in - Telugu News
mictv telugu

అమ్మానాన్నలకు ప్రేమతో బెంజ్.. సందీప్ కానుక

December 2, 2019

Sundeep Kishan 02

పిల్లలు వారు అనుకున్న రంగంలో ఉన్నత స్థానానికి చేరి, కన్నవాళ్లుగా తమ పేరును నిలబెడితే అదే పెద్ద బహుమానం అనుకుంటారు. అలా ఎదిగిన కొడుకు వారికి బహుమతి ఇస్తే ఎలా ఉంటుంది. చాలా గొప్ప అనుభూతి కదూ.. ఆ అనుభూతిని ఇప్పుడు టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ తల్లిదండ్రులు చవిచూస్తున్నారు. బెంజ్‌ జీఎల్‌ఈ 350డీ మోడల్‌ కారును తన తల్లిదండ్రులకు అందజేసిన సందీప్‌.. వారిపై తనకున్న ప్రేమను చాటుకున్నాడు. తనను, తన ఇష్టాలను ఎంతో ఓపికగా భరించినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపాడు. 

Sundeep Kishan 02

ఈ మేరకు సందీప్ సందేశాన్ని ట్వీట్ చేశాడు. ‘నన్ను, నా ఎంపికలను ఎంతో ఓపికగా భరించినందుకు అమ్మ, నాన్నకు ధన్యవాదాలు.  నా వృతిలో ఉన్న ఒడిదుడుకులను అర్థం చేసుకోవడం ఎంతో కష్టమో నాకు తెలుసు. ఈ కానుకను మీకు అందజేయాలని చాలా కాలంగా ఎదురుచూస్తున్నాను.. లవ్‌ యూ. డాడీ మీరు ఎంతో జాగ్రత్తగా కారు డ్రైవ్‌ చేయడం ఎంతో ఆనందంగా ఉంది’ అని పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను కూడా సందీప్ ట్విటర్‌లో పంచుకున్నాడు.