ధన్యవాద్ సోనూ భాయ్.. ఉక్రెయిన్ నుంచి కూడా - MicTv.in - Telugu News
mictv telugu

ధన్యవాద్ సోనూ భాయ్.. ఉక్రెయిన్ నుంచి కూడా

March 4, 2022

11

ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూ సూద్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎందుకంటే కరోనా మహమ్మారి దేశంలో విస్తరించి, వివిధ రాష్ట్రాలకు వలస వెళ్లి జీవనం గడుపుతున్న వారిని దేవుడిలా ఆదుకోని, ఎంతోమందిని వారి వారి స్వంత ప్రాంతాలకు చేరేలా ప్రత్యేక బస్సులను, రైళ్లను, విమానాలను పంపించారు. అంతేకాకుండా ఆర్థికంగా బాధపడుతున్న భారతీయులకు నేనున్నా అంటూ వందల మందికి సహాయం చేశాడు.

ఈ సందర్భంగా గతకొన్ని రోజులుగా రష్యా – ఉక్రెయిన్ దేశాల మధ్య భీకర యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో ఉక్రెయిన్ దేశంలో చిక్కుకుపోయిన భారతీయ వైద్య విద్యార్థులు సోషల్‌ మీడియా వేదికగా సోనూ సూద్‌కు వినతులు పంపారు. దీంతో స్పందించిన ఆయన.. ఖర్కీవ్ పట్టణంలో ఉన్న భారత విద్యార్థులను అక్కడి నుంచి తరలించడానికి సోనూసూద్‌కు చెందిన చారిటీ సంస్థ సేవలు ప్రారంభించాయి. భారతీయులను ఖర్కీవ్‌ నుంచి పోలాండ్‌ సరిహద్దు వరకు తరలించేందుకు చారిటీకి చెందిన సభ్యులు సాయం అందిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌ అవుతున్నాయి.

మరోపక్క కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ గంగా 2022 పేరుతో ఇప్పటికే వేలమంది భారతీయ విద్యార్థులను ఇండియాకు సురక్షితంగా తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సోనూ సూద్ సైతం విద్యార్థులకు సహాయం చేస్తుండడంతో విద్యార్థులు ధన్యవాద్ సోనూ భాయ్ అంటూ కృతజ్జతలు తెలుపుతున్నారు.