థాంక్యూ ప్రభాస్..చివరికి నన్ను కూడా.. - MicTv.in - Telugu News
mictv telugu

థాంక్యూ ప్రభాస్..చివరికి నన్ను కూడా..

May 10, 2022

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ అతిధి మర్యాదల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె, శ్రద్దా కపూర్ లాంటివారు ప్రభాస్ ఆతిధ్యానికి ఫిదా అయినవారే, తాజాగా ఈ లిస్టులోకి మరో బ్యూటీ దిశా పటానీ చేరిపోయింది.

”ప్రభాస్, దీపికా జంటగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ప్రాజెక్ట్ కె’. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తుండగా, దిశా ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తోంది. తాజాగా ఈ బ్యూటీకి ప్రభాస్ అందించిన ఆతిధ్యాన్నికి ఫిదా అయ్యి, సోషల్ మీడియాలో.. “థాంక్యూ ప్రభాస్..చివరికి నన్ను కూడా మీ అతిధి మర్యాదలతో చెడకొట్టినందుకు”అని ట్విట్ చేసింది.

దాంతో పలువురు నెటిజన్స్.. ‘నిత్యం డైట్ పేరుతో ఏవేవో తినే హీరోయిన్లకు అచ్చ తెలుగు వంటకాలు రుచి చూపిస్తే, తినకుండా ఉంటారా? అని, ఇక రండమ్మా బాలీవుడ్ హీరోయిన్లందరూ ప్రభాస్ ఇంటిముందు క్యూ కట్టండి’ అని కామెంట్స్ చేస్తున్నారు.