Tharun Bhascker’s Production No 1 titled Keedaa Cola
mictv telugu

తరుణ్ భాస్కర్ కొత్త సినిమా అప్డేట్ వచ్చేసింది

June 23, 2022

Tharun Bhascker’s Production No 1 titled Keedaa Cola

పెళ్లి చూపులు’ సినిమాతో అందరినీ ఆకట్టుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్. ఇటీవల విడుదలైన ఈ నగరానికి ఏమైంది చిత్రానికి కూడా చాలా మంచి స్పందన వచ్చింది. ‘పెళ్లిచూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’.. ఈ రెండు యూత్‌ను విపరీతంగా ఆకట్టుకున్న సినిమాలు. ముఖ్యంగా ఈ నగరానికి ఏమైంది అనేది చాలామంది ఫేవరెట్. ఈ నగరానికి ఏమైంది సినిమా విడులదయ్యి నాలుగేళ్లు అయ్యింది. ఆ సినిమాకు సీక్వెల్‌ కూడా ఉందని తరుణ్ భాస్కర్ అనౌన్స్ చేసిన కూడా చాలాకాలమే అయ్యింది. అయినా కూడా ఇంకా ఏ అప్డేట్ రాకపోవడంతో ఫ్యాన్స్ కాస్త అసహనంగా ఉన్నారు.

రెండు హిట్లు కొట్టిన తరుణ్ మూడో సినిమా ఎప్పుడొస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే.. ఎట్టకేలకు తరుణ్ భాస్కర్ తన మూడో ప్రాజెక్ట్ ను ప్రకటించాడు. క్రైమ్ కామెడీ జానర్‌లో ఈ సినిమా ఉంటుందని ప్రకటించారు. ఈ సినిమా టైటిల్ ‘కీడా కోల’. ‘కీడా’ అంటే బొద్దింక.. కోలా ఒక సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్. ఈ టైటిల్ లుక్ పోస్టర్‌లో సాఫ్ట్ డ్రింక్ సీసా క్యాప్‌పై టైటిల్ రాసి ఉంది. డ్రింక్‌కి బదులు రక్తం పొంగుతూ బయటికి రావడం మరింత ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. అలాగే పోస్టర్‌లో ఒక బొద్దింక‌ను కూడా చూపించారు. ’’ మునుపెన్నడూ లేని విధంగా క్రైమ్ కామెడీని ఆస్వాదించండి’’ అంటూ పోస్టర్‌ను విడుదల చేశారు. ఫ‌స్ట్‌లుక్‌తోనే త‌రుణ్ ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఇంప్రెస్ చేశాడు. ఈ చిత్రంలోని న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల గురించి త్వ‌ర‌లో వెల్ల‌డించ‌నున్నారు.