ఆ దర్శకుడిని చెప్పుతో కొట్టాలి.. వాసిరెడ్డి పద్మ - MicTv.in - Telugu News
mictv telugu

ఆ దర్శకుడిని చెప్పుతో కొట్టాలి.. వాసిరెడ్డి పద్మ

November 27, 2019

That director should be beaten slippers .. Vasireddy Padma

తమిళ దర్శకుడు భాగ్యరాజ్ వ్యాఖ్యలపై ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్, వైఎస్సార్‌సీపీ నేత వాసిరెడ్డి పద్మ ఘాటుగా స్పందించారు. మహిళల పట్ల అనుచితంగా మాట్లాడిన ఆ దర్శకుణ్ని చెప్పుతో కొట్టాలి అని నిప్పులు చెరిగారు. భాగ్యరాజ్ చేసిన వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా ఉన్నాయని అన్నారు. ఇలాంటి దర్శకుణ్ని చెప్పుతో కొట్టాలి అని నిప్పులు చెరిగారు. మహిళల అత్యాచారాలపై భాగ్యరాజ్ చేసిన వ్యాఖ్యలు బాధ్యతా రహితంగా ఉన్నాయని.. వెంటనే ఆయన మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై తమిళనాడు ప్రభుత్వానికి కూడా లేఖ రాస్తానని తెలిపారు. 

కాగా, మహిళలు సెల్‌ఫోన్ అతిగా వాడటంతో చేయిదాటిపోయారని భాగ్యరాజ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అత్యాచార ఘటనల్లో పురుషులదే తప్పు అనడం సబబు కాదు.. మహిళలకు బలహీనత ఉండటంవల్లే పురుషులు దానిని అవకాశంగా తీసుకుని అకృత్యాలకు పాల్పడుతున్నారని అన్నారు. ఇదిలావుండగా భాగ్యరాజ్ వ్యాఖ్యలపై గాయని చిన్మయి కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.