ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలో నివాసం ఉంటున్న ఓ వృద్ధురాలిపై ఆమె ఎంతో ఇష్టంగా పెంచుకున్న పెంపుడు కుక్క (పిట్‌బుల్ డాగ్) ఇటీవలే దాడి చేసి, ఆమెను ఘోరంగా చంపేసింది. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా కుక్కలను పెంచుకుంటున్న పలువురు యాజమానులు శునకాలను రోడ్లపై వదిలేస్తున్నారు. ఈ క్రమంలో పిట్‌బుల్ డాగ్‌ను మేం దత్తత తీసుకుంటాం, మీ సాధుకుంటాం, మీ కొంటాం అంటూ కొంతమంది జంతుప్రియులు, స్వచ్చంద సంస్థలు ఆ కుక్క కోసం అధికారులను తెగ వేడుకుంటున్నారు. ప్రస్తుతం ఈ టాఫిక్ దేశవ్యాప్తంగా చర్చయాంశంగా మారింది. ఇదివరకే ఓ యాజమానురాలిన చంపేసిన ఆ కుక్కను వీళ్లు ఎందుకు కొనాలని, దత్తత తీసుకోవాలని ముందుకొస్తున్నారు? అనే పలు అనుమానాలు చుట్టుపక్కల వారిలో ప్రశ్నార్థకంగా మారాయి.
ఈ ఘటనపై అధికారులు మాట్లాడుతూ..”లక్నోలో ఇటీవలే వృద్ధురాలిని చంపిన పిట్‌బుల్ డాగ్‌ను దత్తత తీసుకోవడానికి జంతుప్రియులు, స్వచ్ఛంద సంస్థలు ఆసక్తిగా ఉన్నాయి. పెంపుడు కుక్క పిట్‌బుల్.. జూలై 12న ఆమెను చంపింది. జూలై 14న మున్సిపల్ కార్పొరేషన్ బృందం ఆ కుక్కను పట్టుకుని, జర్హారలోని యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి పిట్‌బుల్ ఇక్కడే ఉంటోంది. తాజాగా పిట్‌బుల్ కుక్కను దత్తత తీసుకోవడానికి 8 స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చాయి. మరికొంతమంది పిట్‌బుల్ డాగ్‌ను అప్పగిస్తే, ఆలనా పాలనా చూసుకుంటామని మున్సిపల్ కార్పొరేషన్‌ను సంప్రదించిస్తున్నారు” అని అన్నారు.
అనంతరం పలువురు జంతుప్రియులు మాట్లాడుతూ..”వృద్ధురాలి కుమారుడు కైసర్ బాగ్ ప్రాంతంలో జిమ్ ట్రైనర్.. అతను రెండు పెంపుడు కుక్కలను పిటబుల్, లాబ్రడార్లను పెంచుకునేవాడు. మహిళపై దాడి చేసిన బౌనీ అనే కుక్కను మూడేళ్ల క్రితం ఇంటికి తీసుకొచ్చాడు. ప్రస్తుతం లక్నో మునిసిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కుక్కను ఉంచి, దాని ప్రవర్తనను పరిశీలిస్తున్నారు. అయితే.. ఆ కుక్కను మీ దత్తత తీసుకోంటాం. ఎందుకంటే దాని అలానా పాలనా చుసుకోవటానికి మా వద్ద అన్నీ సౌకర్యాలు ఉన్నాయి. ఆమె కూమారుడు అమిత్ మిశ్రా, అధికారులు దానిని అప్పగిస్తే, మేం తీసుకెళ్లిపోతాం” అని అన్నారు.