ఆ హీరోయిన్ నా భర్తను చంపించింది: కృష్ణవేణీ - MicTv.in - Telugu News
mictv telugu

ఆ హీరోయిన్ నా భర్తను చంపించింది: కృష్ణవేణీ

February 18, 2022

news

‘నగ్న సత్యం’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన నటి కృష్ణవేణి. 1979 నుంచి హీరోయిన్‌గా, సహాయక నటిగా, కమెడియన్‌గా ఎన్నో పాత్రలు చేస్తూ, తెలుగు ప్రేక్షకుల మనసులలో చెరిగిపోని ముద్రను వేసుకున్నారు. అంతంటి స్థాయికి ఎదిగిన ఆమె.. తాజాగా తన జీవితంలో జరిగిన కొన్ని సంచలనమైన సంఘటల గుర్చి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. “నేను ‘వారాలబ్బాయి’ డైరెక్టర్‌ రాజచంద్రను పెళ్లి చేసుకున్నాను. అప్పటికే ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలున్నారు. వాళ్లు ఏమీ లేనివారు.

ఇంటి అద్దె కట్టుకోవడానికి కూడా కష్టాలు పడ్డారు. తీరా ఒక్కో మెట్టు ఎదిగి ఒక సినిమాకు రెండు, మూడు లక్షల రూపాయలు తీసుకునే సమయానికి చచ్చిపోయాడు. మేం ఇద్దరం పెళ్లి చేసుకున్నాక కలిసి నాలుగేళ్లున్నాం. నిజానికి నాకు నలుపంటేనే నచ్చదు. టీ నల్లగా ఉంటేనే తాగను, అలాంటిదాన్ని అనుకోని పరిస్థితుల వల్ల నల్లగా ఉండే అతడిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. మీలాంటోళ్లు నాకు హెల్ప్‌గా ఉంటే నేనెక్కడో ఉండేవాడిని అని తరచూ అంటుండేవాడు” అని తెలిపింది.

అంతేకాకుండా ఆయన తీసిన ఎన్నో సినిమాలు వందరోజులు ఆడాయి. అది చూసి ఓర్వలేక ఇండస్ట్రీవాళ్లే ఆయనను హత్య చేశారు. కరెంట్‌ వైర్లతో కాల్చి, పీక పిసికి ఊపిరాడకుండా చేసి చంపేశారు. పోలీసువాళ్లు కూడా ఎవరు చేయించారో మాకు తెలుసు, కానీ మేం ఏం చేయలేం అని చేతులెత్తేశారు. మా కుటుంబాన్ని లేపేస్తామని బెదిరింపులు రావడంతో పోలీసులు రెండేళ్లపాటు ఇంటిచుట్టూ కాపలాగా ఉన్నారు. దీనికంతటికీ కారణమైన హీరోయిన్‌ చనిపోయింది” అని హీరోయిన్ పేరు చెప్పుకుండా, తనకు చేసిన దారుణాన్ని గురించి చెప్పుకొచ్చింది.