అందుకే అన్నయ్య అలా కనిపించాడు: పరుచూరి - MicTv.in - Telugu News
mictv telugu

అందుకే అన్నయ్య అలా కనిపించాడు: పరుచూరి

April 1, 2022

12

టాలీవుడ్ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావుకు సంబంధించిన ఓ ఫొటో ఇటీవ‌లే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ ఫోటోను చూసిన వారందరు అరే వెంకటేశ్వరరావుకి ఏమైంది? ఆయన ఆరోగ్యం బాగలేదా? ఎందుకిలా మారిపోయారు? అంటూ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఆయన తమ్ముడు పరుచూరి గోపాల కృష్ణ మాట్లాడుతూ..” మా అన్నయ్య చాలా బాగున్నాడు. 2017లో ఆస్ట్రేలియా వెళ్లి వ‌చ్చాక ఆరోగ్యం విష‌యంలో కొంత తేడా వచ్చింది. దాంతో పరీక్షలు చేయించాం. ఆహార నియమాలు పాటించాల‌ని వైద్యులు సూచించారు. దీంతో మా అన్న‌య్య దాదాపు 10 కిలోల బ‌రువు తగ్గారు. కానీ ఆయన మేధస్సు మాత్రం అలాగే ఉంది” అని అన్నారు.

అంతేకాకుండా ‘జుట్టుకు ఆయ‌న‌ రంగు వేయట్లేదు. ఆ ఫొటోలో అలా క‌న‌ప‌డ్డారు. ఆ ఫొటో షేర్‌ చేసింది జయంత్‌. ఎందుకు షేర్ చేశావ‌ని అడిగాను. ఆ ఫొటో చూసిన వారందరు మీ అన్న‌య్య‌ జుట్టుకు రంగు ఎందుకు వేసుకోలేదని అడిగారు. మ‌నిషి 80 ఏళ్లు వచ్చాక ఇంకెలా ఉంటాడు. వయసు పెరిగే కొద్దీ శరీర ధర్మాలు మారుతూ ఉంటాయి. నేను కూడా 15 కిలోలు త‌గ్గిను” అని ఆయన అన్నారు. ఈ క్రమంలో అన్న‌య్య వెంక‌టేశ్వ‌ర‌రావు ఎన్నో గొప్ప స్క్రీన్ ప్లేలు అందించార‌ని, ఇప్పుడు ఆయన వృద్ధాప్యంలో ఉన్న‌ప్ప‌టికీ బాగా మాట్లాడుతున్నార‌ని గోపాల కృష్ణ చెప్పారు.