చిరంజీవి సినిమాకు ఆ టైటిల్ కరెక్ట్ కాదు: పరుచూరి - MicTv.in - Telugu News
mictv telugu

చిరంజీవి సినిమాకు ఆ టైటిల్ కరెక్ట్ కాదు: పరుచూరి

July 2, 2022

టాలీవుడ్ ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ చిరంజీవి, రాంచరణ్‌లు కలిసి తాజాగా నటించిన సినిమాపై తన వ్యక్తిగత అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇటీవలే సినిమాను చూశాను. సినిమాలో నటించిన నటినటులు, కథ సాగిన తీరు, సంగీతంపై పరుచూరి గోపాలకృష్ణ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

 

”మెగాస్టార్ చిరంజీవి, రాంచరణ్‌లు కలిసి నటించిన ‘ఆచార్య’ సినిమాను ఈ మధ్యే చూశాను. సినిమాకు ‘ఆచార్య’ అనే టైటిల్ అవసరం లేదని నాకు అనిపించింది. ‘ఆచార్య’ చూస్తున్నప్పుడు నేను రాసిన ‘మరో మలుపు’ గుర్తుకు వచ్చింది. ‘మరో మలుపు’ వెళ్లిన దారిలోనే ఈ సినిమా సాగింది. 1980లో ఎన్నో ఎర్ర సినిమాలు వచ్చాయి. అప్పుడు ఆడాయి. ఇప్పుడు ఎర్ర సినిమాలను తీయడం గాని, రాయడం గాని మానేశారు. కానీ, కొరటాల శివకు ఈ కోరిక పుట్టడం, దానికి చిరు అంగీకరించడం మంచి పరిణామం. సినిమాగా చూస్తే ఇందులో తప్పు ఏమీ లేదు. కానీ, కథలో ముఖ్యమైన సంఘటన ఎందుకు జరిగింది? ఏం జరిగింది? అనేది చెప్పకుండా కథను నడిపించిన తీరు ప్రేక్షకుడిని అయోమయంలో పడేసింది. రాంచరణ్ పోషించిన సిద్ధ పాత్ర ఫస్టే వచ్చుంటే బాగుండేది. కరెక్ట్‌గా చెప్పాలంటే రాంచరణ్ చేత ఈ ‘సిద్ధ పాత్ర చేయించకుండా ఉంటేనే బాగుండేది” అని ఆయన రాసుకొచ్చారు.

ఇక, ఫ్లాష్ బ్యాక్ విషయానికొస్తే.. కేవలం 10 శాతం ఉంచి, చిరు స్టోరీ 90 శాతం ఉండుంటే ఈ కథ రిజల్ట్ మరోలా ఉండేదని అన్నారు. ఆచార్యకు సంగీతం సరిగ్గా కుదరలేదని, కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న పాత్రలో చిరు స్టెప్పులు చేయకుండా ఉంటే బాగుండేదని ఆయన తెలిపారు. చివరగా ఈ చిత్రానికి ‘ఆచార్య’ అనే టైటిలే అవసరం లేదని తనకు అనిపించిందని పరిచూరి గోపాలకృష్ణ వివరించారు.