ఆ వాయిస్ నాది కాదు.. రోహిత్ రెడ్డే చేయిస్తున్నాడు: మహేందర్‌రెడ్డి - MicTv.in - Telugu News
mictv telugu

ఆ వాయిస్ నాది కాదు.. రోహిత్ రెడ్డే చేయిస్తున్నాడు: మహేందర్‌రెడ్డి

April 28, 2022

తెలంగాణ రాష్ట్రంలో ఓ ఆడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ ఆడియోలో ఉన్న ప్రకారం వికారాబాద్ జిల్లా తాండూరు టౌన్‌ సీఐ రాజేందర్‌రెడ్డిదిలా ఉన్న గొంతు టీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి అసభ్యంగా వ్యాఖ్యలు చేస్తోంది. దీంతో సీఐ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ..”సర్‌ మంచిగా మాట్లాడండి” అని అన్నారు. అవతలి వ్యక్తి మ‌రింత ఆగ్ర‌హానికి గురై, బూతులు తిట్టిన‌ట్లు ఆ ఆడియోలో విన‌ప‌డుతోంది. తనను ఇలా దూషించడంపై ఇప్ప‌టికే పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాన‌ని సీఐ తెలిపారు. మహేందర్‌రెడ్డి తీరుపై రోహిత్‌రెడ్డి మ‌ద్ద‌తుదారులు గ‌త‌ రాత్రి తాండూరు పోలీస్‌స్టేషన్‌ ఎదుట ధర్నా చేశారు.

ఈ నేపథ్యంలో గురువారం మ‌హేంద‌ర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ…”సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోన్న‌ ఆ ఆడియో నాది కాదు. ఆ మాటలు కూడా నావి కావు. నేను ఈ విష‌యాన్ని కోర్టులో తేల్చుకుంటా. ఎన్ని కేసులు పెట్టినా సిద్ధంగా ఉన్నా. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డే ఇదంతా చేయిస్తున్నాడు. భావిగి భద్రేశ్వరస్వామి రథోత్సవ కార్యక్రమంలో నా ముందుకు రౌడీ షీటర్లు వచ్చారు. నన్ను ఇబ్బంది పెట్టే ప్ర‌య‌త్నాలు చేశారు. దీనిపై నేను రూరల్, టౌన్ సీఐతో మాట్లాడా” అని ఆయన వివరణ ఇచ్చారు. పోలీసులు అంటే తనకు గౌరవం ఉందని అన్నారు.