That's why the counting is delayed..easy clarity
mictv telugu

కౌంటింగ్ అందుకే ఆలస్యం..ఈసీ క్లారిటీ

November 6, 2022

మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ జాప్యంపై చర్చ నడుస్తున్న సమయంలో ఎన్నికల అధికారి వికాస్ రాజ్ స్పందించారు. కౌంటింగ్ పారదర్శకంగా జరుగుతోందని.. ఆర్వో సంతకం చేసిన తర్వాతే ఫలితాలను విడుదల చేస్తున్నామని తెలిపారు. 47 మంది అభ్యర్థులు ఉండడంతో ఆలస్యం అవుతోందని వివరించారు. ప్రతీ టేబుల్ దగ్గర పార్టీ ఏజెంట్లు ఉన్నారన్న ఆయన కౌంటింగ్‌లో ఎలాంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేసారు.ఇతర రాష్ట్రాల ఫలితాలతో దీనిని పోల్చవద్దని వికాస్ రాజ్ సూచించారు. ప్రతీ రౌండ్‌కి అరగంట కంటే ఎక్కువ సమయం పడుతోందని తెలిపారు.