పాకిస్తాన్, భారత్‌ల మధ్య చివరి ద్వైపాక్షిక సిరీస్ 2012లో జరిగింది. ఆ సందర్భంగా జరిగిన ఓ సంఘటనను అప్పటి పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ జాకా అష్రాఫ్ ఓ సంఘటనను తలచుకున్నాడు. ‘అప్పటి పరిస్థితులను బట్టి క్రికెటర్లతో పాటు వారి భార్యలను కూడా తోడుగా పంపాం. భారత మీడియా అవకాశం కోసం కాచుకు కూర్చుంది. ఏ చిన్న తప్పు దొర్లినా మన దేశ ప్రతిష్ట దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంది. వాళ్లకు ఆ అవకాశం ఇవ్వకూడదని నిర్ణయించాం. వెంట భార్యలు ఉంటే క్రికెటర్లు నియంత్రణలో ఉంటారని సూచించా’ అని వెల్లడించారు. అప్పుడు పాక్ జట్టు ఇండియాలో మూడు వన్డేలు, రెండు టీ20 మ్యాచులు ఆడింది. అనంతరం జరిగిన పరిణామాల వల్ల ద్వైపాక్షిక సిరీస్‌లే కాదు, ఐపీఎల్ నుంచే పాకిస్తాన్ బహిష్కరణకు గురయ్యింది.