40 వేల ఏళ్ల కిందటి రాకాసి తల - MicTv.in - Telugu News
mictv telugu

40 వేల ఏళ్ల కిందటి రాకాసి తల

June 12, 2019

The 40,000-year-old severed head of a wolf, with teeth and fur, has been found in Siberia.

సైబీరియాలోని యాకుటియాల అనే ప్రాంతంలో 40 వేల ఏళ్ల నాటి ఓ రాకాసి తోడేలు తలను శాస్త్రవేత్తలు గుర్తించారు. మెదడుతో సహా ఆ తోడేలు తలలోని ఇతర భాగాలు పెద్దగా పాడవకుండా ఉండటం శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ తోడేలు తల మంచులో ఉండడం వలన దాని భాగాలు పాడవకుండా ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ రాకాసి తోడేలు తల పరిమాణము ప్రస్తుత తోడేళ్ల తల పరిమాణం కంటే పెద్దగా ఉంది.

మామూలు తోడేళ్ల తల 9 అంగుళాలు ఉంటే ఈ రాకాసి తల దాదాపు 16 అంగుళాల పొడువు ఉంది. దీని గురించి టోక్యోకు చెందిన జికియే యూనివర్శిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌కు చెందిన ప్రొఫెసర్‌ నావోకీ సుజుకి మాట్లాడుతూ..’ఆ రాకాసి తోడేలు తలలోని మెదడు, కండరాళ్లు, వివిధ భాగాలు బాగానే ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న తోడేళ్ల జాతితో, సింహాలతో రాకాసి తోడేళ్లను పోల్చిచూసి వాటి శక్తి సామర్థ్యాలను అంచనా వేస్తాం’ అన్నారు. రష్యన్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ అల్బర్ట్‌ ప్రోటోపోపోవ్‌ మాట్లాడుతూ..‘ఇదో అద్భుతమైన ఆవిష్కరణ. పూర్తి స్థాయి కణజాలంతో ఓ జంతువు తలను కనుగొనటం ఇదే మొదటిసారి’ అని అన్నారు.