5వ రోజు బతుకమ్మ… అట్ల బతుకమ్మ - MicTv.in - Telugu News
mictv telugu

5వ రోజు బతుకమ్మ… అట్ల బతుకమ్మ

October 13, 2018

‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో… బంగారు బతుకమ్మ ఉయ్యాలో..’ ఊరూవాడా ఇప్పుడు ఇవే పాటలు మారుమోగుతున్నాయి. బతుకమ్మ ఆటపాటలతో తెలంగాణ పండుగ కళను సంతరించుకుంది. ఆడపడుచుల ఆనందాలు మిన్నంటాయి. 9 రోజుల పాటు పూలతో పరవశించిపోయే పండుగ బతుకమ్మ. ఈ ఉల్లాసపు, ఉత్సాహపు పండుగలో నాలుగు రోజులు గడిచిపోయాయి. ఈరోజు ఐదవరోజు బతుకమ్మ. ఈరోజు ‘అట్ల బతుకమ్మ’ పండుగ.The 5th Day Bathukamma … Atla bathukamma

మరి ఈరోజు స్పెషల్ ప్రసాదం ఏంటంటే అట్లు. ఈరోజు

అట్లను బతుకమ్మకు ప్రసాదంగా సమర్పిస్తారు. తరువాత బతుకమ్మను నదిలో తీసుకువెళ్లి వదులు తారు. నది నీటిని తలపై చల్లుకుని  తిరిగి వచ్చేస్తారు. బియ్యం, మినప పప్పు ఒకరోజు ముందుగానే నానబెట్టి రుచికరమైన అట్లు వేస్తారు. బతుకమ్మల నిమజ్జనం తర్వాత అమ్మలక్కలందరూ అట్లు పంచుకుని తింటారు. ఇంటికి తిరిగొస్తూ కూడా పాటలు పాడుకుంటూ హుషారుగా వస్తారు అమ్మలక్కలు.