బతుకమ్మ సంబురాల్లో 7వ రోజు.. నేడు వేపకాయల బతుకమ్మ - MicTv.in - Telugu News
mictv telugu

బతుకమ్మ సంబురాల్లో 7వ రోజు.. నేడు వేపకాయల బతుకమ్మ

October 15, 2018

బతుకమ్మ ఉత్సవాలు తెలంగాణ ప్రాంతాన్ని తీరొక్క పూలతో పావనం చేస్తున్నాయి. ఆడపడుచులంతా అమ్మగారిళ్ళకు చేరిపోయి సంబురాలు జరుపుకుంటున్నారు. 9 రోజుల వైభవంతో పండుగ వాతావరణం చాలా ఆహ్లాదంగా వుంది. నిన్న అలిగిన బతుకమ్మ నేడు వేపకాయల బతుకమ్మగా వస్తోంది.9 రోజుల బతుకమ్మ పండుగలో ఈరోజు ఏడవ రోజు బతుకమ్మ పండుగను వేపకాయల బతుకమ్మగా జరుపుకుంటారు. ఇది నవరాత్రి పండుగ ఆరవ రోజున జరుపుకుంటారు. ఈరోజు ఫలహారంగా సకినాలపిండితో వేప పండ్లు రూపంలో తయారు చేస్తారు. అందుకే ఈ రోజు పండుగకు వేపకాయల బతుకమ్మ పండుగ అని పేరొచ్చింది. సాయంత్రం అందరూ ఒక్కచోట చేరి బతుకమ్మ ఆట ఆడిపాడి నిమజ్జనం చేస్తారు. ఆ తర్వాత పిండి వేపకాయల ప్రసాదాన్ని పంచుకుంటారు.