‘ఆచార్య’ ట్రైలర్ వచ్చేసింది - MicTv.in - Telugu News
mictv telugu

‘ఆచార్య’ ట్రైలర్ వచ్చేసింది

April 12, 2022

 

chiram

చిరు – చరణ్ కాంబినేషన్‌లో తొలిసారి వస్తున్న చిత్రం ఆచార్య ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో తండ్రీకొడుకులు పోటీపడి నటించారు. ముఖ్యంగా ఎమోషన్స్ పలికించడంలో ఇద్దరూ విజయవంతం అయ్యారు. ఇద్దరూ నక్సలైట్లుగా నటించిన ఈ చిత్రం కథాపరంగా దేవాలయం గురించే ఉంటుందన్నది ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతోంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 29న భారీ స్థాయిలో విడుదలవుతోంది. దానికంటే ముందు ప్రిరిలీజ్ ఈవెంటును ఘనంగా నిర్వహించాలని భావిస్తున్నారు. దీనికి పవన్ కల్యాణ్‌ను ముఖ్య అతిథిగా పిలుస్తున్నట్టు టాలీవుడ్‌లో వినిపిస్తోంది. మణిశర్మ సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే శ్రోతలను ఆకట్టుకున్నాయి.