సినిమా టికెట్లపై ఏపీ ప్రభుత్వం 2% దందా - MicTv.in - Telugu News
mictv telugu

సినిమా టికెట్లపై ఏపీ ప్రభుత్వం 2% దందా

June 3, 2022

సినిమా టికెట్ల ధరలపై ఏపీ ప్రభుత్వం తీరు పలు విమర్శలకు దారితీస్తోంది. ఇటీవల ఆన్‌లైన్‌లో సినిమా టికెట్లు విక్రయించాలని నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి టికెట్‌పైనా 2 శాతం కమీషన్ వసూలు చేయనుంది. ఏపీ స్టేట్ ఫిల్మ్ టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా సినిమా టికెట్లను ప్రభుత్వం ఆన్‌లైన్‌లో విక్రయించనుంది. దీంతో.. ఇక నుంచి రాష్ట్రంలోని ఏ మూలన సినిమా చూడాలన్నా ఈ పోర్టల్ ద్వారానే టికెట్లను కొనుగోలు చేయాల్సిందే. ప్రైవేటు యాప్‌ల ద్వారా టికెట్లు కొనుగోలు చేసినా ప్రభుత్వానికి రెండుశాతం కమీషన్ చెల్లించాల్సి ఉంటుంది.