The AP High Court has suspended the recruitment notification for senior resident posts
mictv telugu

మరో జాబ్ నోటిఫికేషన్ రద్దు చేసిన హైకోర్టు

November 22, 2022

The AP High Court has suspended the recruitment notification for senior resident posts

ఏపీలో మరో జాబ్ నోటిఫికేషన్ రద్దయింది. మంగళవారం హైకోర్టు ఈ మేరకు తీర్పునిచ్చారు. ఇటీవల డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, ఏపీ డీఎంఈ ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్య, దంత వైద్య కళాశాలల్లోని 49 విభాగాల్లో 1458 సీనియర్ రెసిడెంట్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు.

నవంబర్ 19తో దరఖాస్తు ప్రక్రియ కూడా ముగిసింది. ఈ నేపథ్యంలో నియామక ప్రక్రియలో ప్రైవేట్ కాలేజీలలో చదువుకున్న విద్యార్ధులను అనుమతించడం లేదని కర్నూలుకి చెందిన డాక్టర్ ఝాన్సీరాణితో పాటు మరికొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏ కాలేజీలోనైనా మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులని వాదించారు. దీంతో ఏకీభవించిన హైకోర్టు నోటిఫికేషన్ ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, రెండ్రోజుల క్రితమే హైకోర్టు మరో ఉద్యోగ నోటిఫికేషన్ ని తాత్కాలికంగా రద్దు చేసింది. ఇలా వరుసగా నోటిఫికేషన్లు రద్దవుతుండడంతో నిరుద్యోగుల్లో ఆందోళన మొదలైంది. విడుదల సమయంలోనే అధికారులు ఇలాంటి వివాదాలు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.