కరోనా తలదన్నే వైరస్ ఇంకోటుంది.. ముందుంది ముసళ్ల పండగే - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా తలదన్నే వైరస్ ఇంకోటుంది.. ముందుంది ముసళ్ల పండగే

May 31, 2020

 

Most Dangerous.

ఇప్పుడు ప్రపంచమంతా కరోనావైరస్‌తో నానా తిప్పలు పడుతున్నారు. ప్రాణాలు గుప్పిటలో పెట్టుకుని బతుకుతున్నారు. ఇంతకన్నా దారుణమైన వైరస్ ఇంకోటి ఉండదేమోనని భీతిల్లిపోతున్నారు. అయితే దీని కన్నా కూడా భయంకరమైన మరో వైరస్ కూడా ఉందనీ.. అది కూడా మనుషుల ప్రాణాలను పీక్కు తినడానికి సిద్ధంగా ఉందని ఓ అమెరికన్ వైద్యుడు హెచ్చిరిస్తున్నారు. దాని పేరు బర్డ్ ఫ్లూ వ్యాధి అనీ.. అది ప్రపంచాన్ని వణికించే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలిపారు. ముందున్నది ముసళ్ల పండగే అంటున్నారాయన. ఇదెంత ప్రమాదకరమైందంటే.. ప్రపంచ జనాభాలో సగం మందిని కోల్పోతామని ఆయన చెప్పారు. శాఖాహారాన్ని ప్రోత్సహించే గ్రూపుకు చెందిన డాక్టర్ మైఖేల్ గ్రెగర్ అనే అమెరికన్ వైద్యుడు బర్డ్ ఫ్లూ గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. బర్డ్ ఫ్లూ ముందు కరోనా పిల్లల ఆటలా ఉంటుందని హెచ్చరించారు. ఆయన ఇటీవల అంటువ్యాధులను ఎలా నివారించాలి అనే కొత్త పుస్తకం రాశారు. అందులో డాక్టర్ మైఖేల్ గ్రెగర్ శాఖాహారం ప్రయోజనాలను వివరించారు. జంతువుల మాంసం వల్ల అనేక రకాల అంటు వ్యాధులు వ్యాపిస్తున్నాయని పేర్కొన్నారు. 

దీంతో మొత్తం మానవ జాతికి ముప్పు ఉందనీ.. జంతువుల పెంపకం నుంచి వాటి వేట, మాంసాన్ని తినడం మానవాళిని ప్రమాదంలో పడేసిందన్నారు. ‘జంతువుల నుంచే మానవులకు వ్యాపించే చాలా వైరస్‌లు ఎటువంటి హాని కలిగించవు. కానీ క్షయ, SARS వైరస్ వంటి కొన్ని వైరస్‌‌లు చాలా వేగంగా పెరుగి, అత్యంత ప్రమాదకరంగా మారుతాయి. చైనాలోని వుహాన్ మాంసం మార్కెట్‌లోని జంతువుల మాంసం ద్వారా కరోనా వైరస్ సంక్రమించి, మానవుల శరీరంలోకి ప్రవేశించింది. చికెన్ నుంచి వైరస్ వ్యాపించే ప్రమాదం ఎక్కువగా  ఉంది. ప్రస్తుతానికి, మొత్తం ప్రపంచంలో సుమారు 2400 కోట్ల కోళ్లను పెంచుతున్నారు. 20 సంవత్సరాల క్రితం దాని సంఖ్య సగమే ఉంది. నేటి పశు వ్యవసాయంలో చికెన్ పెద్ద భాగం. దాదాపు అన్ని దేశాలలో కోడి గుడ్డు తింటున్నారు. కోళ్లకు రసాయన ఆహారాలను పెడతారు. దీంతో చికెన్‌లో వైరస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. దీని ద్వారా మానవ శరీరంలోకి ప్రవేశించవచ్చు. ఎక్కువ సంఖ్యలో ఎంత క్రూరంగా మనం చికెన్ తయారు చేస్తున్నామో, వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఎక్కువగానే ఉంది. ఇది మహమ్మారిని ఆహ్వానించడం లాంటిదే’ అని పుస్తకంలో పేర్కొన్నారు ఆయన.