సినిమాకెళ్లే ఉద్యోగులకు అస్సాం సీఎం బంపరాఫర్ - MicTv.in - Telugu News
mictv telugu

సినిమాకెళ్లే ఉద్యోగులకు అస్సాం సీఎం బంపరాఫర్

March 16, 2022

0000

కశ్మీర్‌లో పండిట్‌ల పట్ల 1990లో జరిగిన దారుణ సంఘటనలను ఆధారంగా చేసుకొని బాలీవుడ్‌లో తెరకెక్కిర చిత్రం ‘ది కశ్మీర్ ఫైల్స్’. రోజు రోజుకూ ప్రజాదరణతో పాటు థియేటర్ల సంఖ్యను పెంచుకుంటూ వెళ్తున్న ఈ సినిమా తాజాగా ప్రభుత్వాల వరకు వెళ్లింది. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇప్పటికే పన్ను మినహాయింపు ఇవ్వగా, అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సినిమాను చూడాలనుకునే ప్రభుత్వ ఉద్యోగులకు ఒక పూట సెలవు ప్రకటించింది. సినిమా చూసిన మరునాడు ఉన్నతాధికారులకు సినిమా టిక్కెట్ చూపిస్తే ఉద్యోగులకు సెలవు మంజూరు అవుతుంది. ఈ మేరకు అస్సాం ముఖ్యమంత్రి హేమంత బిశ్వ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.