The audio recording of Shraddawakar-Aftab Poonawala's fight has been found by the policeThe audio recording of Shraddawakar-Aftab Poonawala's fight has been found by the police
mictv telugu

శ్రద్ధావాకర్ హత్య కేసులో కీలక మలుపు.. పోలీసులు చేతికి ఆడియో, వీడియో టేపులు

December 26, 2022

The audio recording of Shraddawakar-Aftab Poonawala's fight has been found by the police

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన శ్రద్ధావాకర్ హత్య కేసులో సోమవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. హత్యకు ముందు శ్రద్ధా – అఫ్తాబ్ మధ్య జరిగిన గొడవ తాలూకు ఆడియో టేపు పోలీసుల చేతికి చిక్కింది. వీరిద్దరు తీవ్రస్థాయిలో గొడవపడుతున్నప్పుడు ఆ ఆడియో రికార్డైంది. దీంతో శ్రద్ధాను ఎలా వేధించాడో ఈ ఆడియో టేపు ద్వారా తెలిసే అవకాశంతో పాటు కేసులో కీలక సాక్ష్యంగా మారే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఆడియోలో ఉన్న గొంతును పోల్చుకునేందుకు అఫ్తాబ్ వాయిస్ నమూనాలను సేకరించనున్నారు. ఇదిలా ఉంటే వీరిద్దరి వీడియో క్లిప్ కూడా పోలీసులకు లభ్యమైంది. ముంబైలో శ్రద్ధా ఫిర్యాదు చేసినప్పుడు పోలీసులు అఫ్తాబ్ కి కౌన్సిలింగ్ ఇచ్చారు. దీన్ని నిర్ధారించుకోవడానికి అఫ్తాబ్ కి ఫేస్ రికగ్నైజేషన్ టెస్ట్ చేయనున్నారు. ఇక బెయిల్ కోసం అఫ్తాబ్ వేసిన పిటిషన్ వాపసు తీసుకోవడంతో కోర్టు కొట్టివేయగా, జనవరి 6 వరకు జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ న్యాయస్థానం పొడిగించింది.