మహిళల క్రికెట్‌లో గురువారం కొత్త రికార్డు నమోదైంది. ఒకే ఇన్నింగ్స్‌లో ఓ కెప్టెన్ ఏకంగా తొమ్మిది మంది ప్లేయర్లతో బౌలింగ్ చేయించి సంచలనం సృష్టించారు. ఈ అరుదైన సంఘణ పాకిస్తాన్ – ఆసీస్ మహిళల క్రికెట్ మ్యాచులో చోటుచేసుకుంది. మొదట టాస్ నెగ్గిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 96 పరుగులు చేసింది. అనంతరం ఆసీస్ 12.4 ఓవర్లలో ఛేదించి గెలుపు సొంతం చేసుకుంది. అయితే పాక్ బ్యాటింగ్ సమయంలో ఆసీస్ కెప్టెన్ మెగ్ లానింగ్ 9 మంది ప్లేయర్లతో బౌలింగ్ చేయించింది. కెప్టెన్‌గా తాను వికెట్ కీపర్ మినహా జట్టులోని మిగతా ఆటగాళ్లతో బౌలింగ్ చేయించి అంతర్జాతీయ క్రికెట్‌లో తన పేరు లిఖించుకుంది. మహిళల క్రికెట్‌లో ఇలా జరగడం ఇదే తొలిసారైనా పురుషుల క్రికెట్‌లో ఇదివరకు ఆరుసార్లు ఇలా జరిగింది. అయితే అవన్నీ చిన్న దేశాలు కావడంతో క్రికెట్ ప్రేమికుల దృష్టికి రాలేదు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
1. 2019 – బెర్ముడాపై పపువా న్యూగినియా
2. 2021 – జర్మనీపై డెన్మార్క్
3. 2022 – బహమాస్‌పై కేమాన్ దీవులు
4. 2022 – ఇండోనేషియాపై దక్షిణ కొరియాల
5. 2022 – బోట్స్‌వానాపై సెయింట్ హెలెనా
6. 2022 – కామెరూన్ పై సియారా లియోన్