The baby kicks her stomach whenever ranjithame song is played
mictv telugu

రంజితమే పాటకు కడుపులో బిడ్డ డ్యాన్సులు..

January 14, 2023

The baby kicks her stomach whenever ranjithame song is played

పాట వస్తుంటే చిన్నా, పెద్దా తేడాలేకుండా గెంతులు వేయడం మామూలే! కానీ కడుపులోని బిడ్డ పాటకు అనుగుణంగా కదులుతుంటే ఆ తల్లిదండ్రులే కాదు.. దాన్ని కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

విజయ్, వంశీ పైడిపల్లి, దిల్ రాజు కాంబినేషన్ లో ఈ రోజు విడుదలైన సినిమా వారసుడు. మూడు రోజుల క్రితమే తమిళంలో వారిసు పేరిట రిలీజ్ అయింది. ఇందులోని పాటలన్నీ కూడా అందరి మనసులను ఆకట్టుకున్నాయి. అందులో రంజితమే పాటకు ఫ్యాన్స్ ఎక్కువ అంటే అతిశయోక్తి కాదేమో! గత కొంతకాలంగా యూట్యూబ్ లో సూపర్ హిట్ పాటగా నిలుస్తున్నది.
మంచి ఊపున్న పాట వచ్చినప్పుడు చిన్నా, పెద్దా తేడా లేకుండా పాడడమూ లేదా కాలు కదపడమో చేస్తుంటాం. కానీ రంజితమే పాట పెట్టగానే కడుపులోని బిడ్డ గెంతులు వేయడం నిజంగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. ఎన్నిసార్లు పాట పెట్టినా గెంతులు మాత్రం ఆపడం లేదు. అంతలా ఆ పాట ఆకర్షించింది ఆ పుట్టబోయే బిడ్డని. ఈ వీడియోని తమిళనాడుకు చెందిన ఓ మహిళ ఈ వీడియోను షేర్ చేసింది. దీనికి ఈ సినిమా సంగీత దర్శకుడు తమన్ స్పందిస్తూ.. ‘ఈ వీడియో చూస్తుంటే మధురానుభూతికి లోనవుతున్నా. నా రోజును ఇది ఎంతో సంతోషంగా మార్చేసింది’ అని ట్వీటారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది.

వారిసు తమిళంలో మంచి కలెక్షన్లతో ముందుకు సాగుతున్నది. మంచి కుటుంబ కథా చిత్రమని పలువురు సినీ ప్రియలు ప్రశంసిస్తున్నారు. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలను దృష్టిలో ఉంచుకొని ఆలస్యంగా సంక్రాంతి బరిలోకి దిగిందీ సినిమా. తెలుగులో మరి వారసుడు ఎంతవరకు మెప్పిస్తాడో తెలియాలంటే ఈ రోజు సాయంత్రం వరకు ఆగితే టాక్ తెలిసిపోతుంది.