ఆ ఎలుగుబంటి చనిపోయింది.. మత్తు ఇంజెక్షన్ ఇవ్వడమే కారణం?
Editor | 21 Jun 2022 9:28 AM GMT
ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో గత కొన్ని రోజులుగా ప్రజలను ముప్పుతిప్పలు పెట్టిన ఎలుగుబంటి ఆకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోయింది. ఈ ఉదయం వజ్రపుకొత్తూరు మండలం కిడిసింగిలో ఎలుగుబంటిని అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే. గన్ సాయంతో మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఎలుగుబంటిని బందించారు. అనంతరం శ్రీకాకుళం నుంచి విశాఖ జూకు తరలించే క్రమంలో మార్గమధ్యంలో ఎలుగుబంటి మృతి చెందింది. సాయంత్రం 5 గంటల సమయంలో దారిలో మృతి చెందినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఎలుగుబంటి మృతికి మత్తు ఇవ్వడమా లేక తీవ్ర గాయాలే కారణమా? అనే దానిపై అటవీ శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. ఆదివారం కిడిసింగి గ్రామానికి చెందిన ఓ వృద్ధుడిపై ఎలుగు దాడి చేయడంతో అతను ప్రాణాలు విడిచిన విషయం తెలిసిందే. మరో ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.
Updated : 21 Jun 2022 9:28 AM GMT
Next Story
© 2017 - 2018 Copyright Telugu News - Mic tv. All Rights reserved.
Designed by Hocalwire