The best national actress award is mine says Tamannaah
mictv telugu

ఈసారి జాతీయ ఉత్తమ నటి అవార్డ్ నాదే.. తమన్నా

September 22, 2022

గ్లామర్ రోల్స్‌తోపాటు నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లో నటిస్తూ తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది హీరోయిన్ తమన్నా. అయితే ఈ మధ్య ఎందుకో తెలుగు సినిమాలు తగ్గించినట్లు తెలుస్తోంది. గోపిచంద్ సరసన నటించిన సీటీమార్ సినిమా తర్వాత తమన్నా తెలుగు సినిమా రాలేదు.. సత్య దేవ్ సరసన నటించిన గుర్తుందా శీతాకాలం సినిమా వాయిదా పడుతూ వస్తోంది. ఈ క్రమంలో బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. అంతకుముందు అజయ్ దేవగణ్‌తో కలసి నటించిన ‘హిమ్మత్ వాలా’ పెద్ద హిట్టవుతుందని పెట్టుకున్న ఆశలు ఆవిరవడంతో మళ్లీ.. బాలీవుడ్‌లో ఇంకో ఛాన్సంటూ ప్రయత్నిస్తోంది. ఇప్పుడు హిందీలో ఏకంగా మూడు చిత్రాలను పూర్తి చేసింది. అందులో ఒకటి బబ్లీ బౌన్సర్‌.

ఈ చిత్రం ద్వారా తన కెరీర్‌లో తొలిసారి జాతీయ అవార్డు వస్తుందని గట్టిగా నమ్ముతోంది. దీని గురించి ఆమె ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ మదుర్‌ బండార్కర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కచ్చితంగా తనకు జాతీయ ఉత్తమ నటి అవార్డు లభిస్తుందని ధీమా వ్యక్తం చేసింది. తాను ఇందులో హర్యానాకు చెందిన యువతిగా నటించానని తెలిపింది. మొట్టమొదటిసారిగా లేడీ బౌన్సర్‌ ఇతివృత్తంతో రూపొందింన కథా చిత్రం ఇదని చెప్పింది. ఇలాంటి చిత్రంలో నటించే అవకాశం రావడం నిజంగా తన అదృష్టమని పేర్కొంది. ఈ చిత్రంతో తనకు కూడా ఉత్తమ జాతీయ నటి అవార్డు లభిస్తుందనే నమ్మకం ఉందని చెప్పింది. ఈ అవార్డు రావాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానని పేర్కొంది. అయితే ఈ చిత్రం థియేటర్లో కాకుండా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోండటం గమనార్హం. కాగా చిన్న గ్యాప్‌ తరువాత ఈమె కోలీవుడ్‌లో రజనీకాంత్‌ హీరోగా నటిస్తున్న జైలర్‌ చిత్రంలో ముఖ్య పాత్రలో నటిస్తోంది.