పిల్లలను పెంచడం పెద్ద సవాలే. పేరెంటింగ్ అనేది చాలా సున్నితమైంది. పిల్లలు కొన్నిసార్లు మొండిగా ప్రవర్తిస్తుంటారు. ఒక్కోసారి చిన్న విషయానికే ఏడుస్తుంటారు. కాబట్టి పిల్లలకు ఒప్పులు, తప్పులు నేర్పించాలి. పిల్లలను ఎలా పెంచాలో తెలియక చాలామంది తల్లిదండ్రులు ఒత్తిడికి లోనవుతుంటారు. ఈ మధ్యే ఓ సర్వే పిల్లలను సరైన మార్గంలో ఎలా పెంచాలో వెల్లడించింది. తల్లిదండ్రులు, పొరుగువారు లేదా ఉపాధ్యాయులు, ప్రతి ఒక్కరూ సలహా ఇస్తూనే ఉంటారు. పిల్లలు చేసే పనులకు బయట నుంచి వచ్చే కంప్లైట్స్ తో తల్లిదండ్రలు ఒత్తిడికి లోనవుతుంటారు. ఏమీ చేసినా పిల్లలు మారడం లేదని బాధపడుతుంటారు. కాబట్టి సైన్స్ ప్రకారం పేరెంటింగ్ పద్దతి ఏంటో తెలుసుకోండి. పిల్లలను ఈవిధంగా పెంచితే మీరు ఒత్తిడి లేకుండా హ్యాపిగా ఉండొచ్చు.
ప్రతి విషయం నేర్చుకోవడం అవసరం లేదు:
క్రీడలు, వినోదం కోసం పిల్లలను ఆడనివ్వడంలో తప్పు లేదు. ప్రతిదాని నుంచి కొత్త విషయం నేర్చుకుంటారని అనుకోవద్దు. పిల్లలకు వారికి స్వంత ఇష్టానుసారం చేసే పనులు నుంచి చాలా నేర్చుకుంటారు. కాబట్టి మీరు వారి అభ్యాసంపై ఎల్లప్పుడూ దృష్టి పెట్టవలసిన అవసరం లేదు.
పిల్లలు విసుగు చెందడం సహజం:
పిల్లలు విసుగు చెందిన ప్రతిసారీ ఏం జరిగింది ఎలా జరిగిందంటూ వారిని ఇబ్బంది పెట్టడం సరైంది కాదు. ఇలా చేస్తే పిల్లలకు విసుగు వస్తుంది. పిల్లలు విసుగు చెందడంలో తప్పు లేదు. పిల్లలను పిల్లలకు వారికి నచ్చిన విధంగా ఉండేందుకు అవకాశం వారికి ఇవ్వండి.
వారి సమస్యలు వారే పరిష్కరించుకోనివ్వండి:
ప్రతిక్షణం పిల్లలతోనే ఉంటూ వారికి ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా చేయకండి. వారికంటూ స్వంతగా ఆలోచించుకునే సమయం ఇవ్వండి. కొంతమంది తల్లిదండ్రులు స్కూల్ బస్ అయినా, ప్లేగ్రౌండ్ అయినా ఎల్లప్పుడూ తోడుగా ఉండాలనుకుంటున్నారు. అలా చేయడం మీ బిడ్డను తమ స్వంత సమస్యలను పరిష్కరించుకోకుండా చేసినట్లవుతుంది. మీ పిల్లలకు స్వంత సమస్యను పరిష్కరించుకోవడం నేర్చుకునేలా చూడండి.
పిల్లల చుట్టూ ఎప్పుడూ ఉండకండి:
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల శ్రద్ధ వహించడం సహజం. రోజంతా వారితో ఉండటం వల్ల వారి మూడ్ పాడవుతుంది. అంతే కాదు, తల్లిదండ్రులు అయిన తర్వాత, చాలా మంది తమ బిడ్డకు అనుగుణంగా తమ జీవితాన్ని మార్చుకుంటారు. మీ పిల్లల కొరకు మీరు ఎలాంటి త్యాగం చేయవలసిన అవసరం లేదు. బదులుగా, పిల్లలు స్వతంత్రంగా ఎదిగే అవకాశం ఇస్తే సరిపోతుంది.