బిగ్‌బాస్ షో ప్రేక్షకులకు బిగ్ షాక్ - MicTv.in - Telugu News
mictv telugu

బిగ్‌బాస్ షో ప్రేక్షకులకు బిగ్ షాక్

March 3, 2022

13

తెలుగులో ఇప్పటికే 5 సీజన్లు పూర్తి చేసుకున్న ‘బిగ్‌బాస్‌ షో’కు బ్రేకులు పడ్డాయి. దీంతో అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురౌతున్నారు. గత నెల 26న గ్రాండ్‌గా లాంచ్ అయిన షో.. 17 మంది కంటెస్టెంట్లతో 24 గంటల పాటు 84 రోజులు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో ఈ షో లైవ్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికే ఈ షో మొదలై దాదాపు వారం రోజులు గడిచింది.

ఒకవైపు షో మొదలైనప్పటి నుంచి పలువురు నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నా, అప్పుడే హౌజ్‌లో గొడవలు, టీంలు, నామినేషన్లు మొదలయ్యాయి. ఫుల్‌ ఆసక్తిగా సాగుతున్న ఈ షోకు బుధవారం ఆటంకం ఏర్పడింది. సాంకేతిక సమస్యల కారణంగా ఈ లైవ్‌ స్ట్రీమింగ్‌ తరచూ ఆగిపోతోంది. దీనిపై తరచూ సబ్‌స్క్రైబర్ల నుంచి కంప్లైంట్స్‌ కూడా వస్తున్నాయట. ఇదిలా ఉంటే అందరినీ నిరాశపరుస్తూ నిన్న అర్ధరాత్రి నాన్ స్టాప్ లైవ్ స్ట్రీమింగ్‌ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నిలిపివేసింది.

దీంతో షాక్‌కు గురైన ప్రేక్షకులకు ఏం జరుగుతోందో అర్థంకాక సతమతమవుతున్నారు. షో ఎందుకు ఆగిపోయిందో హాట్ స్టార్ వెల్లడించకపోవటంతో మండిపడుతున్నారు. దీంతో స్పందించిన హాట్ స్టార్ గురువారం అర్ధరాత్రి నుంచి మళ్లీ స్ట్రీమింగ్‌ను ప్రారంభిస్తామని తెలిపింది.

మరోపక్క ఇటీవలే సీపీఐ నారాయణ బిగ్‌బాస్ షో అంటే ముంబైలోని రెడ్‌లైట్ ఏరియాతో సమానం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.