మెదక్ జిల్లా ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి బుధవారం పెను ప్రమాదం తప్పింది. అక్కన్నపేట రైల్వే గేటు సమీపంలో పద్మా దేవేందర్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా ఎగిరిపడింది. దీంతో ఆమెకు ఎలాంటి గాయాలేమీ తగులకుండా బయటపడ్డారు.
వివరాల్లోకి వెళితే.. మెదక్ పట్టణంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం పద్మా దేవేందర్ రెడ్డి రామాయంపేటలో జరుగుతున్న ఓ వివాహానికి హాజరయ్యేందుకు బయలుదేరారు. ఈ క్రమంలో అక్కన్నపేట రైల్వే గేటు వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి వచ్చిన కారు ఎమ్మెల్యే కారును బలంగా ఢీకొట్టింది. దీంతో ఎమ్మెల్యే కారు భారీ శబ్ధంతో అల్లంత ఎత్తున ఎగిరిపడింది. అయితే, ఈ ప్రమాదంలో ఎమ్మెల్యేకు గానీ, కారులోని ఇతరులకు గానీ, ఎలాంటి గాయాలు కాలేదు.దీంతో పార్టీ కార్యకర్తలు ఊపిరిపీల్చుకున్నారు.