'ది బర్త్ ఆఫ్ వెన్నెల' ట్రైలర్ అదిరిపోయిందిగా: వెంకటేశ్ - MicTv.in - Telugu News
mictv telugu

‘ది బర్త్ ఆఫ్ వెన్నెల’ ట్రైలర్ అదిరిపోయిందిగా: వెంకటేశ్

June 16, 2022

తెలుగు చిత్రసీమ పరిశ్రమతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ‘విరాట పర్వం’. ఈ సినిమా జూన్ 17న (శుక్రవారం) విడుదల కాబోతుంది. సాయి పల్లవి – రానా ప్రధానమైన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సంబంధించి అభిమానులు భారీ అంచనాలను వేసుకుంటున్నారు. ఈ క్రమంలో బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో వెంకటేశ్ ‘ది బర్త్ ఆఫ్ వెన్నెల’ అనే పేరుతో ఓ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

ఆ ట్రైలర్‌లో..’అడవిలో అర్ధరాత్రివేళలో వర్షం కురుస్తుండగా ఓ స్త్రీకి పురిటి నొప్పులు మొదలవుతాయి. ఆమెను ట్రాక్టర్‌పై హాస్పిటల్‌కి తీసుకుని వెళుతుండగా, నక్సలైట్స్‌కీ, పోలీసులకి మధ్య జరుగుతున్న కాల్పుల్లో చిక్కుకుంటారు. అప్పుడు ఒక లేడీ నక్సలైట్ ఆమెకి పురుడు పోసి, ఆ పాపకి ‘వెన్నెల’ అనే పేరు పెడుతుంది. ఆ మరుక్షణమే ఆ లేడీ నక్సలైట్ పోలీస్ తూటాలకు బలవుతుంది.’

అనంతరం వెంకటేష్ మాట్లాడుతూ.. ‘ది బర్త్ ఆఫ్ వెన్నెల’ ట్రైలర్ అదిరిపోయిందిగా, అంతేగా అంటూ ప్రేక్షకుల చేత ఈలలు వేయించారు. ట్రైలర్‌ను చూస్తున్న సినీ హీరోలు, ప్రేక్షకులు తమ తమ అభిప్రాయాలను తెలియజేస్తూ, చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ చేప్తున్నారు. ఈ ట్రైలర్‌తో విరాట పర్వం సినిమాపై భారీ అంచాలు పెరిగాయి. ఇప్పటికే విడుదలైనా పాటలు, సినిమా పోస్టర్స్ మంచి టాక్‌ను సొంతం చేసుకున్నాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ‘ది బర్త్ ఆఫ్ వెన్నెల’ ట్రైలర్ చూసేయండి.