వీడియో : ఆరు బంతుల్లో ఆరు వికెట్లు.. బౌలర్ అరుదైన ఘనత - MicTv.in - Telugu News
mictv telugu

వీడియో : ఆరు బంతుల్లో ఆరు వికెట్లు.. బౌలర్ అరుదైన ఘనత

April 13, 2022

cric ket

హ్యాట్రిక్ తీయడమే గొప్ప అనుకునే ఇప్పటి రోజుల్లో ఓ బౌలర్ ఆరు బంతుల్లో ఆరు వికెట్లు తీసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. మలేషియా క్లబ్ ఎలెవన్ తరపున ఆడుతున్న వీరన్ దీప్ సింగ్ అనే బౌలర్ ఈ ఘనత సాధించాడు. నిజానికి వీరన్ దీప్ సింగ్ ఐదు బంతుల్లో ఐదు వికెట్లు తీసినప్పటికీ, ఆరో బంతికి రనౌట్ అవడంతో ఆరు బంతుల్లో ఆరు వికెట్లుగా భావించాల్సి వచ్చింది. వివరాల్లోకెళితే.. నేపాల్ ప్రొ కప్ టీ20 ఛాంపియన్ షిప్‌లో భాగంగా మలేషియా క్లబ్ ఎలెవన్, పుష్ స్పోర్ట్స్ ఢిల్లీ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో వీరన్ దీప్ సింగ్ బౌలింగుకు వచ్చేసరికి ఢిల్లీ స్కోరు 131-3గా ఉండేది. సింగ్ తొలి బంతిని వైడ్ వేశాడు. తర్వాతి బంతికి బ్యాట్స్‌మెన్ రనౌట్ అయ్యాడు. మిగిలిన ఐదు బంతులకు ఐదు వికెట్లు తీశాడు. ఈ క్రమంలో హ్యాట్రిక్ నమోదు చేశాడు. దీంతో దీప్ సింగ్ ఓవర్ ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 132-9గా మారిపోయింది. ఈ క్రమంలో రెండు ఓవర్లతో 8 పరుగులిచ్చి 5 వికెట్లను పడగొట్టి కెరీర్ బెస్ట్ నమోదు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కాగా, ఇంతకుముందు ఆస్ట్రేలియాకు చెందిన బౌలర్ అలెడ్ క్యారీ క్లబ్ క్రికెట్‌లో తొలిసారి ఆరు బంతుల్లో ఆరు వికెట్లు తీశాడు. అయితే అంతర్జాతీయ క్రికెట్‌లో ఎవ్వరూ కూడా ఇప్పటివరకు ఈ ఫీట్‌ను సాధించలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.