The boy fell into the borehole in eluru district
mictv telugu

ఏలూరు : బోరుబావిలో పడ్డ బాలుడు.. కూడా దిగి కాపాడిన యువకుడు

July 7, 2022

బోరుబావిలో పడ్డ బాలుడిని ఓ యువకుడు తన ప్రాణాలను పణంగా పెట్టి కాపాడాడు. ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమల మండలం గుండుగోలనుకుంట గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన జశ్వంత్ అనే తొమ్మిదేండ్ల బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ బోరు బావిలో పడిపోయాడు. 400 అడుగుల లోతు ఉన్న ఆ బావిలో 30 అడుగుల వద్ద ఓ రాయి అడ్డుపడడంతో బాలుడు అక్కడే ఆగిపోయాడు. కాసేపటికి బాలుడు కనిపించకపోయేసరికి వెతుకులాట ప్రారంభించిన తల్లిదండ్రులకు బోరు బావిలో నుంచి బాలుడి అరుపులు వినపడడంతో అక్కడికి చేరుకున్నారు. గ్రామస్తులు కూడా వచ్చి ఎలా తీయాలా అని ఆలోచిస్తున్న తరుణంలో సురేష్ అనే యువకుడు ధైర్యం చేసి ముందుకు వచ్చాడు. తాను తాడు కట్టుకొని తల కిందులుగా లోపలికి దిగుతానని, బాలుడిని పట్టుకున్నాక అందరూ కలిసి తాడును బలంగా లాగమని చెప్పి లోపలికి దిగాడు. కాసేపటికి జశ్వంత్‌ను చేరుకున్న సురేష్ అతని నడుముకు తాడు కట్టగా, పైకి సురక్షితంగా లాగడంతో ఇద్దరూ క్షేమంగా బయటపడ్డారు. కాగా, ఎలాంటి ప్రమాదం కానీ, ప్రాణాపాయం కానీ జరక్కపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకోగా, సాహసం చేసి బావిలోకి దిగిన సురేష్‌ను గ్రామస్తులు అభినందించారు.