The boy grabbed the ice cream from the hand of the vendor
mictv telugu

ఐస్‌క్రీంతో ప్రాంక్ చేయబోయి బుడ్డోడికి చిక్కాడు.. ఫన్నీ వీడియో

September 14, 2022

The boy grabbed the ice cream from the hand of the vendor

యూరప్ దేశమైన టర్కీలో ఐస్‌క్రీం అమ్మకం దారులు కస్టమర్లను వెరైటీగా ఆటపట్టిస్తుంటారు. కోను చేతిలో పెట్టినట్టే పెట్టి అమాంతం వెనక్కి లాగేసుకుంటారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంటాయి. కొన్ని ఫన్నీగా కూడా ఉంటాయి. అయితే ఇదంతా సరదాగా చేస్తుంటారు. జనాలు కూడా ఇందులోని ఫన్‌‌ను ఆస్వాదిస్తుంటారు.

కానీ, ప్రతీసారి వ్యాపారస్థులదే పైచేయి అవుతుందనుకుంటే పొరపాటు. అప్పుడప్పుడు వారు కూడా ఖంగుతినే పరిస్థితులు వస్తాయి. ఈ వీడియోలో జరిగింది అదే. కస్టమర్లకు ఫ్రస్టేషన్ వచ్చేవరకు ప్రాంక్ చేద్దామనుకొని చిన్న పిల్లాడి చేతిలో బుక్కయిన ఈ వీడియో మరింత ఫన్ పంచుతోంది. ఇందులో ఓ వ్యాపారస్థుడు బుడ్డోడి ముందు ప్రాంక్ చేస్తూ ఐస్‌క్రీం అందకుండా ఆటపట్టిస్తుంటాడు. కాసేపు ఓపిగ్గా ఎదురుచూసిన సదరు బాలుడు చివరికి కోపం పట్టలేక ఐస్ క్రీం కర్రను చేతితో గట్టిగా పట్టుకుంటాడు. అతను వెనక్కి లాగుదామని ఎంత ప్రయత్నించినా పిల్లాడి బలం ముందు నిలవలేకపోతాడు. చివరకి పిల్లాడు హీరోలా స్టిక్ చివర ఉన్న తన ఐస్‌క్రీం తీసుకొని హాయిగా తింటూ వెళ్లిపోతాడు. ఈ వీడియోలో బుడ్డోడు మామూలోడు కాదంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.