బాబాయ్‌‌ని నమ్మించి అబ్బాయ్ చేసిన ఘోరం ఇదీ..  - MicTv.in - Telugu News
mictv telugu

బాబాయ్‌‌ని నమ్మించి అబ్బాయ్ చేసిన ఘోరం ఇదీ.. 

February 14, 2020

Suryapet

కొందరు దుర్మార్గులు ఇప్పుడు డబ్బు, కామం అనే రెండింటి దాహంతో పశువుల్లా ప్రవర్తిస్తున్నారు. క్రైంలో కూడా క్రియేటివిటీని ఉపయోగిస్తున్నారు. బీమా డబ్బుల కోసం సొంత బాబాయినే హత్య చేసి, అది రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని ప్రయత్నించాడు. చివరికి కటకటాల పాలయ్యాడు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం తాడ్వాయికి చెందిన సైదులు ఈ నెల 24న రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. బొలేరో వాహనం ఢీకొట్టడంతో అతను చనిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టగా అసలు ఆ రోడ్డు ప్రమాదం ఓ కుట్ర అని తేల్చారు. మృతుడి పేరు మీద రూ.50లక్షలు బీమా ఉన్నట్టు గుర్తించారు. 

ఒంటరిగా ఉంటున్న వ్యక్తికి ఇంత పెద్ద మొత్తంలో బీమా ఎవరు చేయించారన్న అనుమానంతో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. మృతుడి అన్న కుమారుడు రమేశ్‌ ఫైనాన్స్‌లో నాలుగు లారీలు కొని అప్పుల పాలయ్యాడు. అప్పులవాళ్ల వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో తానే సైదులుపై బీమా చేయించి పథకం ప్రకారం హత్యకు పాల్పడ్డాడు. ఈ నెల 24న కొందరు స్నేహితులతో కలిసి బొలేరో వాహనంతో సైదులును ఢీకొట్టి హత్య చేశాడని పోలీసులు వెల్లడించారు.