అలర్ట్ : సమాజంలో ఇలాంటి దొంగలు కూడా ఉంటారు.. చేరదీయకండి - MicTv.in - Telugu News
mictv telugu

అలర్ట్ : సమాజంలో ఇలాంటి దొంగలు కూడా ఉంటారు.. చేరదీయకండి

May 6, 2022

సాధారణంగా మనం రకరకాల దొంగల గురించి వింటూంటాం. కానీ ఇలాంటి దొంగ గురించి మాత్రం విని ఉండరు. సొంత సోదరి ఇంట్లో దొంగతనం చేసి ఆ బంధానికే మచ్చ తెచ్చే ఇలాంటి సంఘటన ఒడిషా రాజధాని భువనేశ్వర్‌లో జరిగింది. వివరాలు.. జగత్ సింగ్ పూర్‌కు చెందిన రంజిత్ అనే యువకుడు చంద్రశేఖర్‌పూర్‌లో నివాసముండే తన స్వంత సోదరి ఇంట్లో ఉంటున్నాడు. రంజిత్ కొద్ది కాలంగా ఓ యువతితో చనువుగా ఉంటూ షికార్లు చేసేవాడు. ఈ క్రమంలో వద్ద ఉన్న డబ్బు అయిపోవడంతో ప్రేయసితో జల్సాల కోసం తాను నివాసం ఉంటున్న స్వంత సోదరి ఇంట్లో దొంగతనం చేయాలని నిర్ణయించాడు. సోదరుడిపై ఉన్న నమ్మకంతో సోదరి బీరువా తాళం వేయకుండా బయటికి వెళ్లగా, వచ్చి చూసేసరికి 50 వేల డబ్బు, బంగారం, స్కూటీ కనిపించకుండా పోయాయి. వాటితో పాటు రంజిత్ కూడా లేకపోవడంతో అతనిపై అనుమానంతో సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు రంజిత్‌ను అదుపులోకి తీసుకొని సొమ్మును రికవరీ చేశారు.