తొమ్మిదేండ్లలో ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించామని బడ్జెట్-2023ను ప్రవేశ పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. తొమ్మిదేండ్లలో తలసరి ఆదాయం రెట్టింపు అయిందని, ప్రపంచ సవాళ్లను భారత్ ఆర్థిక వ్యవస్థ దీటుగా ఎదుర్కొని నిలబడిందని తెలిపారు. జీ20 అధ్యక్ష బాధ్యతలతో భారత్ కీలక ప్రస్థానాన్ని ప్రారంభించిందన్నారు. ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ కొనసాగుతోందని చెప్పారు. కొవిడ్ సమయంలోనూ ఎవరూ ఆకలితో బాధపడకుండా చూశామన్నారు.
బడ్జెట్‌లో ఏడు అంశాలకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు నిర్మలా సీతారామన్. మహిళలు, రైతుల, యువత, వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు. సప్త రుషుల రీతిలో ఏడు అంశాలకు బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.
1. సమ్మిళిత అభివృద్ధి
2. చివరి వ్యక్తికి కూడా అభివృద్ధి ఫలాలు అందడం
3. మౌలిక సదుపాయాలు మరియు పెట్టుబడి
4. ప్రజల లక్ష్యాలను సాకారం చేయడంలో సహయం
5. గ్రీన్ గ్రోత్
6. యువశక్తి
7. ఆర్థిక రంగం బలోపేతం
పంటల దిగుబడి, బీమాకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు ఆర్ధికమంత్రి. ఆగ్రిటెక్, స్టార్టప్ లకు ప్రాముఖ్యం ఇస్తున్నాం.ఆత్మనిర్బర భారత్ దిశగా అడుగులు వేస్తున్నాం. తృణధాన్యాలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. దేశంలో తృణధాన్యాలకు పెద్ద పీట వేస్తున్నాం. తృణధాన్యాల ఉత్పత్రిలో మనం ముందున్నాం. ఎగుమతుల్లో మనం ముందున్నాం. తృణధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ ఆహారం వందల ఏళ్ళ నుంచి వస్తోంది. చిన్న రైతులు తృణధాన్యాలు పండించాలని నిర్ణయించాం. శ్రీ అన్న రిసెర్చ్ చేయిస్తున్నాం. పర్యాటక రంగాన్ని మరింత ప్రోత్సహించేలా సంస్కరణలు చేయడం. వ్యవసాయ రంగంలో సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రణాళికలు, మత్స్యకారుల అభివృద్ధి కోసం మరిన్ని కేటాయింపులు ఇస్తున్నమని చెప్పారు.