The Cabinet meeting held at Pragati Bhavan under the chairmanship of Chief Minister KCR ended a while back
mictv telugu

ముగిసిన తెలంగాణ కేబినెట్‌ సమావేశం.. బడ్జెట్‌కు మంత్రిమండలి ఆమోదం

February 5, 2023

The Cabinet meeting held at Pragati Bhavan under the chairmanship of Chief Minister KCR ended a while back

ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో జరిగిన కేబినెట్ మీటింగ్ కాసేపటి క్రితం ముగిసింది. ఈ సమావేశంలో బడ్జెట్‌ ప్రతిపాదనలపై చర్చించి ఆమోదం తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక ప్రణాళికపై సమావేశంలో చర్చలు జరిపారు. రేపు అసెంబ్లీలో ఆర్థికమంత్రి హరీశ్‌రావు బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. మంత్రివర్గ సమావేశం ముగియడంతో సీఎం కేసీఆర్ మరికాసేపట్లో నాందేడ్ బయలుదేరి వెళ్లనున్నారు.

ఈ నెల 8న బడ్జెట్ పై సాధారణ చర్చ ఉంటుంది. 9,10,11 తేదీలలో పద్దులపై చర్చ జరగనుంది. ఈ నెల 12న సభలో ప్రభుత్వం ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టనుంది. అదే రోజున బిల్లుకు సభ ఆమోదం తెలపనుంది. అనంతరం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి.