వైరల్ వీడియో, రన్‌వేపై రెండు ముక్కలైన విమానం - MicTv.in - Telugu News
mictv telugu

వైరల్ వీడియో, రన్‌వేపై రెండు ముక్కలైన విమానం

April 8, 2022

fbfcb

రన్‌వేపై రన్నింగులో ఉన్న ఓ విమానం రెండు ముక్కలైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాలు.. జర్మనీకి చెందిన బోయింగ్ 757 కార్గో విమానం కోస్టారికాలోని సాన్‌జోస్ ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరింది. కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక సమస్యలు రావడంతో పైలెట్లు అత్యవసర ల్యాండింగ్ కోసం అధికారులను పర్మిషన్ అడిగారు. అనుమతిచ్చిన అధికారులు సాంకేతిక సమస్యను సరిచేయడానికి సిబ్బందిని కూడా సిద్ధంగా ఉంచారు. ఈ క్రమంలో రన్‌వేపై దిగిన విమానం.. కొద్దిదూరం వెళ్లిన తర్వాత ఆకస్మాత్తుగా రెండు ముక్కలైంది. అయితే పైలెట్లకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం విమానాశ్రమ అధికారులు మాట్లాడుతూ.. విమానంలో హైడ్రాలిక్ సమస్య వల్ల ఈ ఘటన జరిగిందని వివరించారు. అయినప్పటికీ ఉన్నతస్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు.