తెలంగాణ ఇంటర్ కోర్సుల్లో కొత్త గ్రూప్ అందుబాటులోకి రానుంది. వచ్చే విద్యాసంవత్సరం (2023-2024) నుంచి కొత్త కోర్సును ప్రవేశపెడుతున్నట్టు ఇంటర్ బోర్డు సెక్రటరీ వెల్లడించారు. ‘సీఈఏ’ అనే పేరుతో ఈ కొత్త గ్రూప్ ఉంటుందని, ఇందులో అకౌంట్స్‌తో పాటు కామర్స్, ఎకనామిక్స్ సబ్జెక్ట్స్ ఉంటాయని తెలిపారు. మారుతున్న కాలానుగుణంగా ఇంటర్ స్థాయిలోనే ఉద్యోగ నైపుణ్యాన్ని పెంచుకునే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. కాగా, ఇంటర్లో ఇప్పటివరకు బైపీసీ, ఎంపీసీ, సీఈసీ, హెచ్ఈసీ, ఎంఈసీ గ్రూపులు ఉన్నాయి. తాజాగా సీఈఏ గ్రూప్ రావడంతో గ్రూపుల సంఖ్య ఆరుకు చేరింది. అటు ఈ అకౌంట్స్ కోర్సు సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ బోర్డుల్లో 11, 12 తరగతుల వారికి ఎప్పటినుంచో అందుబాటులో ఉంది. దీంతోపాటు సీఈసీ, ఎంఈసీ గ్రూపుల్లో ఉన్న కామర్స్ సబ్జెక్ట్ పేరును కూడా వచ్చే విద్యా సంవత్సరం నుంచి కామర్స్ అండ్ అకౌంటెన్సీగా మారుస్తున్నారు.