సోమవారం రాష్ట్రాల వారీగా అప్పుల వివరాలను వెల్లడించిన కేంద్రం.. తాజాగా మంగళవారం లోక్ సభలో దేశం చేసిన అప్పుల వివరాలను వెల్లడించింది. 2014 – 2015 లో మొత్తం అప్పు రూ. 62. 44 లక్షల కోట్లు ఉండగా, అది 2021 – 2022 నాటికి 138.88 లక్షల కోట్లకు చేరింది. ఇందులో దేశ అంతర్గత అప్పు రూ. 114.62 లక్షల కోట్లు, విదేశీ రుణం రూ. 6.59 లక్షల కోట్లు ఉన్నాయి. ఇతర మార్గాల ద్వారా సేకరించిన రుణ మొత్తం రూ. 17.67 లక్షల కోట్లు ఉన్నట్టుగా ప్రకటించింది. 2014లో యూపీఏ పాలన ముగిసి మోదీ నాయకత్వంలో ఎన్డీఏ పాలన మొదలవగా, ఈ కాలంలోనే అప్పులు రెట్టింపు కంటే ఎక్కువ ఉండడం గమనార్హం. ఇక తెలంగాణ అప్పు రూ. 3.12 లక్షల కోట్లు. ఆంధ్రప్రదేశ్ అప్పు రూ. 3.98 లక్షల కోట్లుగా ఉంది. వీటికి కార్పొరేషన్ ద్వారా సేకరించిన రుణాలు అదనం.