The center disclosed the details of the debts incurred by AP and Telangana
mictv telugu

తెలుగు రాష్ట్రాల అప్పులను వెల్లడించిన కేంద్రం.. ఇలాగైతే కష్టమే

December 19, 2022

The center disclosed the details of the debts incurred by AP and Telangana

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఉన్న అప్పుల వివరాలను సోమవారం కేంద్రం లోక్ సభలో వెల్లడించింది. బీఆర్ఎస్ ఎంపీలు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చిన కేంద్రం.. అందులో భాగంగా దేశంలోని రాష్ట్రాల వారీగా అప్పుల వివరాలను బయటపెట్టింది.

ఏపీ అప్పులు రూ. 3.98 లక్షల కోట్లు
ఏపీలో ఏటేటా అప్పుల భారం పెరిగిపోతోందని కేంద్రం తెలిపింది. విభజన నాటికి 2014లో రాష్ట్ర జీడీపీలో అప్పుల శాతం 42.3 శాతంగా ఉండగా, విభజన తర్వాత అప్పుల శాతం తగ్గిందని చెప్పింది. 2015లో జీడీపీలో అప్పుల శాతం 23.3 శాతం ఉండగా, 2021 నాటికి అది 36.5 శాతానికి పెరిగింది. 2020 – 21 నాటికి అప్పుల్లో 17.1 శాతం పెరుగుదల నమోదైందని పేర్కొంది. మొత్తానికి 2018లో రూ. 2.29 లక్షల కోట్లు ఉండగా, అది ప్రస్తుతం రూ. 3.98 లక్షల కోట్లకు చేరినట్టు వెల్లడించింది.

తెలంగాణ అప్పులు రూ. 3.12 లక్షల కోట్లు
తెలంగాణలో 2018 నాటికి రూ. 1.60 లక్షల కోట్లు ఉన్న అప్పు 2022 నాటికి రూ. 3.12 లక్షల కోట్లకు చేరిందని తెలిపింది. 2017 – 18 లోనే 95.9 వాతం అప్పులు చేశారని వివరించింది. రాష్ట్ర జీడీపీలోనూ గత మూడేళ్లుగా అప్పుల భారం పెరుగుతూ వచ్చింది. 2016 జీడీపీలో అప్పుల శాతం 15.7 ఉండగా, 2022 నాటికి అది 27.4 శాతంగా నమోదైంది.