The center for the poor is Sweetkaburu.. Extension of 3 months
mictv telugu

కేంద్రం తీపికబురు.. మరో 3 నెలలు పొడిగింపు

September 29, 2022

దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఉన్న పేద ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఓ తీపికబురు చెప్పింది. కరోనా టైంలో పేదల కోసం మోదీ ప్రభుత్వం..ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) పథకం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 80 కోట్ల మంది పేదలకు ప్రతినెలా 5 కిలోల బియ్యం లేదా గోధుమలను ఉచితంగా అందజేస్తూ వస్తుంది. అయితే, అమలు గడువును మరో 3 నెలలు పొడిగిస్తూ, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఉత్తర్వులు జారీ చేశారు.

కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాతో మాట్లాడుతూ..”కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యాన్ని 4 శాతం పెంచుతున్నాం. ఈ ఏడాది జూలై 1 నుంచి డీఏ పెంపు అమల్లోకి వస్తుంది. దీంతో ఉద్యోగుల మూల వేతనంలో డీఏ 38 శాతానికి పెరుగుతుంది. 41.85 లక్షల మంది ఉద్యోగులకు, 69.76 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరుతుంది. ఈ నిర్ణయం అమలుకు ప్రభుత్వం ప్రతి ఏటా రూ.12,852.5 కోట్లు వెచ్చిస్తుంది.

దీంతోపాటు, కొవిడ్ సంక్షోభ సమయంలో పేదలకు ఉచితంగా రేషన్ అందించేందుకు ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) అమలు గడువును కేంద్రం మరో 3 నెలలు పొడిగించింది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 80 కోట్ల మంది పేదలకు ప్రతినెలా 5 కిలోల బియ్యం లేదా గోధు మలను ఉచితంగా అందజేస్తున్నాం” అని ఆయన అన్నారు.