The Center has ordered an investigation into Mission Bhagiratha
mictv telugu

మిషన్ భగీరథపై కేంద్రం దర్యాప్తుకు ఆదేశం

May 9, 2022

The Center has ordered an investigation into Mission Bhagiratha

ఇంటింటికీ తాగునీరు అందించాలనే సంకల్పంతో తెలంగాణలో ప్రారంభించిన ‘మిషన్ భగీరథ’ పై కేంద్రం విచారణకు ఆదేశించింది. దర్యాప్తు కోసం ప్రత్యేక అధికారిని నియమించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా, భారీ వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టుపై జల్ జీవన్ కమిషన్ ఇటీవల సర్వే నిర్వహించింది. సర్వే రిపోర్టును కమిటీ కేంద్రానికి అందించింది. ఆ నివేదిక ఆధారంగా కేంద్రానికి ఓ ఫిర్యాదు అందగా, దాని ఆధారంగా దర్యాప్తుకు కేంద్రం చర్యలు తీసుకుంది.