సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన విజయవంతం అవుతోంది. ఉజ్వల డిస్కమ్ అస్యూరెన్స్ యోజన కింద రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థలకు రూ. 10200 కోట్లను విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించింది. కేంద్ర విద్యుత శాఖ అధికారులను తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, స్పెషల్ చీఫ్ సెక్రెటరీ సునీల్ శర్మలు కలిసిన వెంటనే కేంద్రం నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది.
అలాగే మిల్లర్ల నుంచి బియ్యం కొనుగోలుకు ఎఫ్సీఐ సానుకూలంగా స్పందించింది. అటు కేసీఆర్ సీనియర్ అధికారులతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. మార్కెట్ నుంచి రుణాలు సమీకరించడం, కేంద్రం బకాయిలు, ధాన్యం కొనుగోలు, ఇప్పటికే డీపీఆర్ సమర్పించిన సాగునీటి ప్రాజెక్టుల పెండింగ్ అనుమతులు తదితర అంశాలపై చర్చించారు. కాగా, సోమవారం నుంచి ఢిల్లీ పర్యటనలోనే ఉన్న కేసీఆర్ టూర్ పూర్తయ్యేలోపు మరిన్ని నిధులు తెలంగాణకు సాధించి తీసుకువస్తారన్న నమ్మకం ఆ పార్టీ నాయకుల్లో వ్యక్తం అవుతోంది. కాగా, అప్పుల విషయంలో నిబంధనల పేరుతో కొర్రీలు పెట్టిన కేంద్రం.. కేసీఆర్ ఢిల్లీకి వెళ్లడంతో 10 వేల కోట్లను రిలీజ్ చేయనుండడం గమనార్హం.