బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేవారికి కేంద్రం కీలక ప్రకటన చేసింది. తమ వద్దనున్న హాల్‌మార్క్ లేని బంగారు ఆభరణాల స్వచ్ఛతను బీఐఎస్ ధృవీకరణ కేంద్రాలకు వెళ్లి పరీక్షించవచ్చని తెలిపింది. నాలుగు ఆభరణాలకు రూ. 200 ఛార్జీ, అంతకు మించి ఉంటే ఒక్కో ఆభరణానికి రూ. 45 చెల్లించాల్సి ఉంటుందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ వెల్లడించింది. అంతేకాక, కొత్తగా కొనుగోలు చేసే ఆభరణాలకు సంబంధించి హాల్‌మార్క్‌ను బీఐఎస్ కేర్ యాప్ నుంచి కూడా తెలుసుకోవచ్చని పేర్కొంది. కాగా, హాల్‌మార్క్ అంటే బంగారం స్వచ్ఛతను ధృవీకరిస్తూ ఇచ్చే లోగో. దీన్ని కేంద్రం తప్పనిసరి చేసింది. లోగో ఉంటే కస్టమర్లు ఎలాంటి మోసం లేకుండా స్వచ్ఛమైన బంగారం పొందేందుకు వీలు పడుతుంది. మరోవైపు బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి.