The Center's response to the 'ban' of smart phones..that is true but..
mictv telugu

స్మార్ట్‌ ఫోన్ల ‘బ్యాన్‌’పై స్పందించిన కేంద్రం..ఆ మాట నిజమే కానీ..

August 12, 2022

కేంద్ర ప్రభుత్వం గతకొన్ని నెలలక్రితం చైనా దేశానికి చెందిన పలు కంపెనీలు తయారు చేసిన వందలకొద్ది యాప్స్‌ను బ్యాన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో ముఖ్యంగా టిక్‌‌టాక్‌, పబ్జీ, బీజీఎంఐని వంటి యాప్స్‌ను పూర్తిగా నిషేధిస్తూ, ఆయా కంపెనీలపై కేంద్రం సీరియస్ అయ్యింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుందని బ్లూమ్‌ బర్గ్‌ నివేదిక ఓ విషయాన్ని వెల్లడించింది. భారత్‌లో రూ.12వేల లోపు ఉన్న చైనా ఫోన్‌లపై నిషేధం విధించబోతోంది అంటూ పలు విషయాలను వెలుగులోకి తెచ్చింది. ఆ కథనంపై కేంద్రం ప్రభుత్వం స్పందించినట్లు కూడా తెలుస్తోంది.

చైనా సంస్థలైన షావోమీ, ఒప్పో, వివో సంస్ధలు తయారు చేసిన స్మార్ట్ ఫోన్‌లను భారత్‌లో అమ్మకుండా నిషేధం విధించే అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మినిస్ట్రీ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఐటీ శాఖకు ఉన్నతాధికారులు చెప‍్పినట్లు పలు నివేదికలు తెలిపాయి. వాస్తవానికి కేంద్రం రూ.12వేల లోపు ఫోన్‌లపై బ్యాన్‌ చేయాలని చర్చలు జరిపిన మాట నిజమే, కానీ, ఆ ఫోనులు చైనా ఫోన్‌లు కాదని, దేశీయ ఉత్పత్తి సంస్థలైన లావా, మైక్రోమ్యాక్స్‌‌తో పాటు ఇతర కంపెనీలు తయారు చేసిన ఫోన్లు అని వివరాలను వెల్లడించారు.

ఇక, భారత్‌లో మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి జనాభా ఎక్కువగా ఉండడంతో రూ.12 వేల కంటే దిగువన లభించే ఫోన్లే అత్యధికంగా అమ్ముడవుతుంటాయి. ఈ సెగ్మెంట్లో చైనా సంస్థలకు అడ్డుకట్ట వేయాలని భారత్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. చైనా సంస్థలు భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో అగ్రగాములుగా ఉన్నప్పటికీ, నష్టాలు వస్తున్నాయని చూపిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.

మరోపక్క గత కొంత కాలంగా భారత్‌.. చైనా సంస్థలపై ఓ కన్నేసింది. ఆ దేశానికి చెందిన షావోమీ, వివో, ఒప్పోలు కేంద్ర ప్రభుత్వ చట్టాల్ని ఉల్లంఘించి, మనీ ల్యాండరింగ్‌కు పాల్పడినట్లు తేలింది. దీంతో సదరు సంస్థలపై ఈడీ అధికారులు కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.