IMEI మోసాలకు చెక్.. కేంద్రం కీలక ఆదేశాలు - MicTv.in - Telugu News
mictv telugu

IMEI మోసాలకు చెక్.. కేంద్రం కీలక ఆదేశాలు

September 27, 2022

పోగొట్టుకున్న, చోరీ అయిన ఫోన్లు దర్వినియోగం కాకుండా, మోసాలకు చెక్ పెట్టే విధంగా కేంద్రం మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. మొబైల్ తయారీ కంపెనీలు ప్రతీ ఫోన్ ఐఎమ్ఈఐ నెంబర్లను ప్రత్యేక పోర్టల్‌ (https//icdr.ceir.gov.in)లో తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ ఆదేశాలను తప్పక పాటించాలని సూచించింది. ఫోన్ అమ్మకముందే ఈ పని చేయాలని పేర్కొంది. కొన్ని సార్లు నకిలీ ఐఎమ్ఈఐ నంబర్లు వెలుగులోకి వస్తున్నాయని,

పై చర్య వల్ల డివైజ్‌ను కనుగొనడం వీలు పడుతుందని చెప్పింది. అంతేకాక దీని వల్ల స్మార్ట్ ఫోన్ల బ్లాక్ మార్కెటింగుకు కూడా అడ్డుకట్ట పడుతుందని స్పష్టం చేసింది. కాగా, మన ఫోన్లలో ఈ నంబర్ తెలుసుకోవాలంటే *#06# టైప్ చేయాలి. ఒకవేళ రెండు సిమ్ కార్డులు వాడుతుంటే రెండు నెంబర్లు ఉంటాయి.