రుతుపవనాల రాకతో ఖరీఫ్ సాగుకు సమాయాత్తమవుతున్న రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. 2022 – 23 సీజన్‌కు వరి, పత్తి సహా మొత్తం 14 పంటలకు మద్దతు ధరను పెంచింది. ఈ మేరకు కేబినెట్ నిర్ణయం తీసుకోగా, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు.
1. సాధారణ వరి : క్వింటాల్ ధాన్యం కనీస మద్దతు ధరను రూ. 100 పెంచగా, పెంపుతో తాజా ధర రూ. 2040 కి చేరింది.
2. పెసర్లపై రూ. 480 పెంచారు.
3. పత్తిపై రూ. 354 పెంచారు.
4. సోయాబీన్ క్వింటాలుకు రూ. 350
5. కందులకు రూ. 300
6. మొక్కజొన్నపై రూ. 92
7. పొద్దుతిరుగుడుపై రూ. 385
8. నువ్వులపై రూ. 523
9. మినుములపై రూ. 300
10. హైబ్రీడ్ జొన్నపై రూ. 232
11. సజ్జలపై రూ. 100
12. వేరు శెనగపై రూ. 300
13. రాగులపై రూ. 201 వరకు పెంచారు.